News February 6, 2025

ఉపాసన కొత్త కార్యక్రమం.. తొలుత పిఠాపురంలో అమలు

image

అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి బర్త్ డే(FEB5) సందర్భంగా ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం పిఠాపురం నుంచి ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. గర్భిణులకు పౌష్ఠికాహారం, ప్రసూతి, శిశు మరణాలను అరికట్టడం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమన్నారు. త్వరలోనే 109 అంగన్వాడీ భవనాలు పునరుద్ధరిస్తామని చెప్పారు.

Similar News

News April 10, 2026

చేగోమ్మలో PACS గోదాం ప్రారంభించిన పొంగులేటి

image

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

News April 10, 2026

ఒకే రోజు రూ.2,950కోట్లు రిలీజ్.. అకౌంట్లలోకి డబ్బులు: TDP

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి కూటమి ప్రభుత్వం బయట పడేస్తోందని TDP తెలిపింది. CM ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950CR విడుదల చేసినట్లు వివరించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమైనట్లు చెప్పింది. అటు సర్వీస్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులూ మొదలైనట్లు ఓ అకౌంట్లో డబ్బులు పడిన ఫొటోను ట్వీట్ చేసింది.

News April 10, 2026

ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

image

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.