India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలు మార్పులు చేసిన ‘క్లాసిక్ 350’బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ రేపు లాంచ్ చేయనుంది. LED హెడ్‌లైట్, సిగ్నల్స్- వెనుక లైట్‌లో మార్పులు, కొత్త కలర్ వేరియెంట్స్‌ను అందిస్తున్నామని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. 349సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్ వ్యవస్థల్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. లుక్స్ పరంగానూ కొన్ని మార్పులు ఉంటాయని సమాచారం. క్లాసిక్-350 ప్రస్తుత ధర రూ.1.93 నుంచి రూ.2.25 లక్షల వరకు ఉంది.
AP: దగదర్తి(నెల్లూరు), కుప్పం, నాగార్జునసాగర్ వద్ద ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ‘ఈ ప్రాజెక్టుకు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే శక్తి ఉంది. గత నెల నుంచి ఇప్పటివరకు పనుల్లో 4% పురోగతి ఉంది. మొత్తం ఇప్పటివరకు 36% పనులు పూర్తయ్యాయి. గడువు కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తాం’ అని ఆయన వెల్లడించారు.
‘మిస్టర్ బచ్చన్’లో రవితేజ సింగర్ పాత్రలో కనిపిస్తారని డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. ఓ ఓటీటీ షోకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ పాత్రకు కూడా అలనాటి గాయని ‘జిక్కి’ పేరు పెట్టినట్లు చెప్పారు. దీంతో ఈ మూవీ అటు మాస్ ఆడియన్స్‌తో పాటు సంగీత ప్రియులనూ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 15న మిస్టర్ బచ్చన్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
సొంతగడ్డపై అంతర్జాతీయ స్టార్లతో పోటీపడటమే తన కల అని డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా అన్నారు. అతి త్వరలోనే భారత్‌లో ఓ పెద్ద టోర్నీ జరగాలని ఆశించారు. కొత్త సీజన్ ఆరంభంతో తన టెక్నిక్ లేదా ట్రైనింగ్ విధానం మార్చుకొనే టైమ్ లేదన్నారు. ఈటెను విసిరే కోణంలో కొంత మార్పు అవసరమని, అప్పుడే ఎక్కువ పవర్ వస్తుందని పేర్కొన్నారు. దేహం సహకరించకపోయినా అర్షద్‌ను చూసి పారిస్‌లో సీజన్ బెస్ట్ నమోదు చేశానన్నారు.
టిక్‌టాక్, యూట్యూబ్, రిడ్డిట్, ఇన్‌స్టా, FBలపై ఓ 24 ఏళ్ల కెనడియన్ కోర్టులో దావా దాఖలు చేశాడు. అవి మనుషులను బానిసలుగా మారుస్తున్నాయని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నాడు. 2015 నుంచి SM వాడుతున్న తనలో పనిచేసే సామర్థ్యం తగ్గిందని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఇది ప్రతి ఒక్కరి సమస్య అని చెప్పాడు. సోషల్ మీడియా యజమానులు యూజర్ల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాడు.
తెలంగాణలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ‘కుక్క కాట్లు’ నమోదవని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కరుస్తున్నాయి. బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కుక్కల దాడుల నుంచి రక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు. శునకాల నియంత్రణకు ఆపరేషన్లు, రేబిస్ టీకాలు వేయాలని <<13823020>>కోరుతున్నారు<<>>.
అధిక దిగుబడినిచ్చే, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనే 109 కొత్త బయోఫోర్టిఫైడ్ పంట రకాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇందులో మిల్లెట్లు, ఆయిల్ సీడ్స్, పప్పు ధాన్యాలు, పత్తి, చెరుకు తదితర వెరైటీలు ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని ఇండియా అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ సైంటిస్టులు, రైతులతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ గురించి ఆరా తీశారు.
కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశానికి ఒలింపిక్ పతకాల సంఖ్య పెరుగుతోందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి అన్నారు. 1952 నుంచి 2012 వరకు ఇండియాకు 20 మెడల్స్ వస్తే 2016 నుంచి 2024 వరకు 8 ఏళ్లలోనే 15 పతకాలు వచ్చాయని ట్వీట్ చేశారు. ఖేలో ఇండియా, TOPS ద్వారా కేంద్రం అథ్లెట్లకు సపోర్ట్ చేస్తోందని వివరించారు.
ఒక్కో క్రెడిట్ కార్డుపై ఒక్కో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కార్డులు ఉంటే షాపింగ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రీఛార్జ్‌లపై డిస్కౌంట్లు పొందవచ్చు. మల్టిపుల్ కార్డ్స్ వాడటం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గే ఆస్కారం తక్కువ. అయితే డ్యూ డేట్ దాటితే క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కార్డులు ఉన్నాయని ఎలా పడితే అలా వాడితే అప్పులపాలయ్యే అవకాశం ఉంది.
SHARE IT
ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తాను అధికారం కోల్పోవడానికి, బంగ్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ‘నేను సెయింట్ మార్టిన్, బంగాళాఖాతాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే అధికారంలో కొనసాగేదాణ్ని’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అవామీ లీగ్ పార్టీ నేతలకు హసీనా సందేశం పంపినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
Sorry, no posts matched your criteria.