India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శ్రీధర్ బాబు విజ్ఞప్తితో స్పీకర్ సభను మ.2 గంటలకు వాయిదా వేశారు.

TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్‌ఎల్పీ, బీజేపీఎల్పీ ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు 4 శాతం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కులగణన చేసిందని దుయ్యబట్టారు.

TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో లేడీ ఎస్సై శ్వేత మరణించారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా, తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.

భారత స్టాక్‌మార్కెట్లపై DIIs పట్టు పెరుగుతోంది. పెట్టుబడుల పరంగా FIIsతో పోలిస్తే 0.3 శాతమే వెనుకంజలో ఉన్నారు. NSEలో ఫారిన్ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 12 నెలల కనిష్ఠమైన 17.23 శాతానికి పడిపోయాయి. మరోవైపు DIIs హోల్డింగ్స్ 16.9 శాతానికి చేరాయి. ఇక MFs హోల్డింగ్స్ జీవితకాల గరిష్ఠమైన 9.9% వద్ద ఉన్నాయి. 2015లో మన మార్కెట్లలో FIIs పెట్టుబడులు DIIs కన్నా రెట్టింపు ఉండేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది.

‘తండేల్’ సినిమా విడుదల నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే, అనారోగ్య సమస్యలతో హీరోయిన్ సాయి పల్లవి చాలా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఈక్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేసేందుకు ఆమె ముందుకొచ్చారు. హీరో చైతూతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నానని, ఏవైనా అడిగే ప్రశ్నలుంటే చెప్పాలని సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఈనెల 7న ‘తండేల్’ విడుదలవనుంది.

తిరుపతి ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ‘ఎమ్మెల్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనే వీడియో విడుదల చేశారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌తో పాటు బందోబస్త్ పెంచాం. బాలాజీ కాలనీ నుంచి ఎస్వీయూ వరకు వాహనాలు మళ్లించాం’ అని ఎస్పీ స్పష్టం చేశారు.

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్‌కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో US మిలిటరీ విమానం టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్, US గుర్తించాయని ఇటీవల బ్లూమ్‌బెర్గ్ న్యూస్ పేర్కొంది.
Sorry, no posts matched your criteria.