News August 11, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 11, ఆదివారం
✒సప్తమి పూర్తి
✒స్వాతి పూర్తి
✒వర్జ్యం: మధ్యాహ్నం 12.03-1.50 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్రం 04.51 నుంచి 05.42 గంటల వరకు

News August 11, 2024

HEADLINES

image

* వయనాడ్‌ను సందర్శించిన మోదీ.. బాధితులకు పరామర్శ
* తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు
* వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారు: YS జగన్
* కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని TG క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
* కుక్కల దాడులు పెరుగుతున్నా పట్టించుకోరా?: హరీశ్ రావు
* కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. జాగ్రత్త: WHO
* వినేశ్ కేసుపై తీర్పు రేపటికి వాయిదా

News August 10, 2024

పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన భారత్ ప్రయాణం

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. 5 కాంస్యం, ఒక వెండితో కలిపి మొత్తం 6 మెడల్స్ సాధించింది. వినేశ్ ఫొగట్‌కు అనుకూలంగా తీర్పు వస్తే మరో పతకం ఇండియా ఖాతాలో చేరే అవకాశముంది. కానీ స్వర్ణం సాధించడంలో భారత్ విఫలమైంది. గత 4 ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఒకే ఒక్క స్వర్ణ పతకం ఉంది. అది కూడా నీరజ్ చోప్రా సాధించినది కావడం విశేషం. 2028 లాస్ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో తిరిగి భారత్ పుంజుకోవాలని ఆశిద్దాం.

News August 10, 2024

లంచంగా ‘ఆలుగడ్డలు’.. SI సస్పెండ్!

image

టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును. యూపీలోని ఓ ఎస్సై లంచాన్ని కోడ్ భాషలో ‘ఆలుగడ్డలు’ అని అడిగి బుక్ అయ్యారు. భావల్‌పూర్ ఎస్సై రాంకృపాల్ సింగ్ ఓ కేసును పరిష్కరించేందుకు రైతుకు ఫోన్ చేసి 5 కేజీల బంగాళాదుంపలు కావాలని డిమాండ్ చేశాడు. తాను అంత ఇవ్వలేనని, 2 కేజీలు ఇస్తానని బాధితుడు చెప్పాడు. ఆఖరికి 3 కేజీలకు సెటిల్మెంట్ అయింది. ఈ ఆడియో వైరల్ కావడంతో ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు.

News August 10, 2024

BREAKING: హిండెన్‌బర్గ్ మరో బాంబ్

image

హిండెన్‌బర్గ్ మరో బాంబ్ పేల్చింది. అదానీకి చెందిన మారిషస్ కంపెనీల్లో సెబీ చైర్‌పర్సన్ మాదభి పూరి బుచ్‌, ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు ఆరోపించింది. తాము అదానీ గ్రూప్‌పై 18 నెలల క్రితం విడుదల చేసిన నివేదికపై సెబీ చర్యలు తీసుకోకపోవడానికి ఇదే కారణమని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడించింది. దీంతో సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

News August 10, 2024

CM అమెరికా టూర్.. హైదరాబాద్‌కు ‘జొయిటిస్’

image

అమెరికా పర్యటనలో ఉన్న TG CM రేవంత్ జంతు ఆరోగ్య సంస్థ ‘జొయిటిస్’ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని TG CMO తెలిపింది.

News August 10, 2024

BIG BREAKING: వినేశ్‌ అప్పీల్.. తీర్పు వాయిదా

image

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ అప్పీల్‌పై తీర్పు వాయిదా పడింది. తీర్పును ఆగస్టు 11కు వాయిదా వేస్తున్నట్లు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వెల్లడించింది. రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్‌క్వాలిఫై చేసింది. అయితే తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ కోర్టుకెళ్లారు.

News August 10, 2024

గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. కోచ్‌కు హార్ట్ అటాక్

image

పారిస్ ఒలింపిక్స్‌‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్‌ దుస్మంతోవ్ గోల్డ్ మెడల్ గెలిచారు. అయితే అతడితో కలిసి సంబరాలు చేసుకుంటుండగా హెడ్ కోచ్ కిలిచెవ్ గుండెపోటుకు గురయ్యారు. అక్కడే ఉన్న బ్రిటన్‌కు చెందిన డాక్టర్ హర్జ్ సింగ్, ఫిజియో లిల్లిస్ ఆయనకు CPR చేశారు. డెఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో కిలిచెవ్ స్పృహలోకి వచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించిన హర్జ్ సింగ్, లిల్లీస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

News August 10, 2024

జగన్ చేసిన పెంటకు అన్ని వ్యవస్థలు నాశనం: TDP

image

AP: చంద్రబాబు హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న <<13824303>>జగన్<<>> విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం. నువ్వు చేసిన పెంటకు అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి. వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారు చంద్రబాబు. నీ ప్రత్యేక హోదా, 45 ఏళ్లకు పెన్షన్, సన్నబియ్యం, వారంలో సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి?’ అని Xలో ప్రశ్నించింది.

News August 10, 2024

అత్తారింట్లో కొత్త అల్లుడికి 100 రకాల పిండి వంటలు

image

ఇటీవల వివాహమై, ఆషాఢ మాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు పెట్టారు. కాకినాడ(D) కిర్లంపూడి(M) తామరాడకు చెందిన ఉద్ధగిరి వెంకన్నబాబు-రమణి దంపతులు వారి అల్లుడు బాదం రవితేజ, కుమార్తె రత్న కుమారికి శనివారం 100 రకాల పిండి వంటలు స్వయంగా చేసి వడ్డించారు. సాధారణంగా గోదావరి జిల్లాలో అల్లుళ్లకు ఇటువంటి మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తోంది.