India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్‌కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.

రేపు రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అష్టాదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు, ఊంజల్ సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అటు ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కేటాయించే ప్రత్యేక దర్శనాలను, నేటి నుంచి 3రోజుల వరకూ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. నేడు సిఫార్సు లేఖల్ని స్వీకరించబోమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మాజీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. నిన్న ఆయన నివాసంపై <<15338401>>దాడి<<>> జరిగిన ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయనకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న తెల్లవారుజామున మద్యం మత్తులో ఓ యువకుడు ముద్రగడ ఇంటిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ‘ఇద్దరిదీ ఒకే తరహా మైండ్‌సెట్. పారిశ్రామిక వేత్తలకు బానిసత్వం చేస్తుంటారు. వారిలాంటి పిరికిపందల్ని నేనెప్పుడూ చూడలేదు. అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారు. అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారు. ఆయన శీశ్‌మహల్ కడితే మోదీ రాజ్‌మహల్ కట్టారు’ అని విమర్శించారు.

ENGతో T20 సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించారు. ఓ ద్వైపాక్షిక T20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచారు. 2021లో AUSపై కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీ 13 వికెట్లు తీయగా, వరుణ్ ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశారు. ఓవరాల్‌గా ఓ T20 సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా వరుణ్ నిలిచారు. 2022లో ENGపై 15 వికెట్లు పడగొట్టిన హోల్డర్(విండీస్) టాప్‌లో ఉన్నారు.

TG: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు(సబ్ స్టేషన్ల నిర్వాహకులు) వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు కన్వర్షన్ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ బస్ యాత్రను మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటన తర్వాత ఈ నెల 20వ తేదీన చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి నుంచి మొదట ట్రామా సెంటర్‌కి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. CT స్కాన్‌లో ఆయన మెదడులో రక్తస్రావం జరిగినట్లు తేలిందని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై జేపీసీ నివేదిక ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ 14 సవరణలతో కూడిన నివేదికను పార్లమెంటులో సమర్పించనున్నారు. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించే అవకాశం ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

గత నెల 29న ఇస్రో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహంలో స్వల్ప సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఆక్సిడైజర్లను సరఫరా చేసే వాల్వ్‌లు తెరచుకోకపోవడంతో ఇంజిన్లు మొరాయిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇంజిన్లు ఫైర్ అయితేనే శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. భారత్ సొంత నేవిగేషన్ వ్యవస్థ అయిన నావిక్‌కు NVS-02 కీలకం. ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాల్ని ఇస్రో అన్వేషిస్తోంది.

వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీంతో హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఈరోజు సెలవు ఉండనుంది. మిగిలిన విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలా లేదా అనేది యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి మీకు సెలవు ఉందా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.