India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఫార్మావిలేజ్‌కు భూసేకరణ విషయంలో కొద్దిసేపటి క్రితం కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చి, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈనెల 17న సాయంత్రం 6.03 గంటలకు బిహార్‌లోని పట్నాలో ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా, డిసెంబర్ 5న ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ కోసం మీరూ ఎదురుచూస్తున్నారా? కామెంట్ చేయండి.
Flipkart, Amazonపై ED కొరడా ఝుళిపించనున్నట్టు తెలుస్తోంది. కొంత మంది సెల్లర్లను మాత్రమే ప్రోత్సహిస్తూ భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఈ సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. విదేశీ సంస్థలు సెల్లర్లకు వేదికగా ఉండాలే తప్ప వస్తువులపై నియంత్రణ ఉండకూడదని చట్టం చెబుతోంది. ఇటీవల ED జరిపిన సోదాల్లో ఉల్లంఘనలు రుజువైనట్లు తేలింది. ఈ-కామర్స్ వ్యాపార విధానాలపై ముందు నుంచీ విమర్శలున్నాయి.
HYDలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కలిగిన వారికి TGSRTC ఆఫర్ ప్రకటించింది. ఆ పాస్‌తో TGతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌లో 10% రాయితీని ఇవ్వనున్నట్లు తెలిపింది. మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్ పాస్‌లకు కూడా ఈ రాయితీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.
AP: ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బిల్లులకు, చర్చలకు అనుగుణంగా శనివారం కూడా సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు 2పూటలా సభ జరగనుంది. మరోవైపు, ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ జరిపేందుకు MLAలు విధిగా అసెంబ్లీకి రావాలన్నారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేస్తామని సీఎం వెల్లడించారు.
AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక తల్లికి వందనం స్కీమ్‌కు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు.
తనను ‘ఉలగనాయగన్’ వంటి స్టార్ టైటిల్స్‌తో పిలవొద్దని సినీపరిశ్రమ, మీడియా, అభిమానులకు కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. ఆర్ట్ కంటే ఆర్టిస్ట్ గొప్ప కాదనే విషయాన్ని తాను నమ్ముతానని, తానెప్పుడూ గ్రౌండెడ్‌గా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ మరింత మెరుగవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కమల్ హాసన్/కమల్/KH అని మాత్రమే పిలవాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
TG: తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే <<14582636>>కేటీఆర్ ఢిల్లీ<<>> వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఫార్ములా-ఈ రేసు కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు సూచించారు. కేటీఆర్‌పై వచ్చిన అభియోగాలపై విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరామని చెప్పారు.
తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేవారు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆనంద నిలయం విమాన గోపురంపై వాయవ్య మూలన గూడు లాంటి చిన్న మందిరం ఉంటుంది. వెండి మకరతోరణంతో ఉన్న ఆ మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహ దర్శనం మూలమూర్తి దర్శనంతో సమానమని ప్రతీతి. క్యూలో, రద్దీ కారణంగా ఆనంద నిలయంలోని స్వామి వారి దర్శనం కాకపోతే ఈ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా యాత్రా ఫలం దక్కుతుందని నమ్మకం.
కాలుష్యానికి కారణమయ్యే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టపాసులు కాల్చడంపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు లేదని ప్రశ్నించింది. కాలుష్యం అనేది ఏడాదంతా సమస్యగా మారినప్పుడు కేవలం పండుగ సమయాల్లో నిషేధం విధిస్తున్నారని ఢిల్లీలో కాలుష్యంపై కేసు విచారణ సందర్భంగా కోర్టు తప్పుబట్టింది. ఫ్యాషన్‌గా టపాసులు కాలిస్తే అది ప్రాథమిక ఆరోగ్య హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.