India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హరియాణా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి అన్ని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు ‘గుడ్ మార్నింగ్’కు బదులుగా ‘జై హింద్’ చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. స్వాతంత్య్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ జైహింద్ నినాదంతో ప్రజలను ఒక్కటి చేసిన విషయం తెలిసిందే.
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేశ్ ఫొగట్ చేసిన అభ్యర్థనపై విచారణ మరింత ఆలస్యం కానుంది. ఇవాళ మ.1.30కే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ విచారణ జరపాల్సి ఉండగా, అది సాయంత్రం 5.30కు వాయిదా పడింది. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వినేశ్ తరఫున వాదనలు వినిపించనున్నారు. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
సూర్యుడి నుంచి ఈ నెల 7, 8 తేదీల్లో వెలువడిన 3 తీవ్రస్థాయి సౌర తుఫాన్లు వచ్చే 2 రోజుల్లో భూమిని తాకనున్నాయి. అవి సెకనుకు వెయ్యి కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నాయని సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ తెలిపింది. ఉపగ్రహాలు, కమ్యూనికేషన్స్, పవర్ గ్రిడ్స్‌పై వీటి ప్రభావం ఉండొచ్చంది. వీటిలో మూడో తుఫాను కేటగిరీ-3 స్థాయిదని వివరించింది. సాంకేతిక మౌలిక వసతుల విషయంలో ముందుగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది.
సన్ ఆఫ్ సర్దార్ -2 షూటింగ్ కోసం UK వెళ్లాల్సిన స్టార్ నటుడు సంజయ్ దత్ వీసా రద్దు కావడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీసా మంజూరు చేసిన ఒక నెల తరువాత సంజయ్ జైలు జీవితం కారణంగా చూపుతూ యూకే ప్రభుత్వం వీసా రద్దు చేసింది. అన్ని పేమెంట్స్ జరిగాక, ఇప్పుడు రద్దు చేయడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. అయినా అల్లర్లు జరుగుతున్న UKకు ఎవరు వెళ్తారని వ్యాఖ్యానించారు.
కంపెనీల వ్యాల్యూయేషన్ పరంగా ముకేశ్ అంబానీ కుటుంబ సంపద మనదేశ జీడీపీలో 10 శాతంతో సమానమని తేలింది. బార్ల్కేస్-హురున్ ఇండియా నివేదిక ప్రకారం మార్చి 20, 2024 నాటికి వారి సంస్థల విలువ రూ.25.75 ట్రిలియన్లు. తద్వారా దేశంలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ ఫ్యామిలీ మొదటి స్థానంలో నిలిచింది. ప్రైవేటు పెట్టుబడులు, లిక్విడ్ అసెట్స్‌ను ఈ లెక్కింపు నుంచి మినహాయించారు.
AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్) పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఇటీవల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రిజైన్ చేసిన విషయం తెలిసిందే.
TG: పేదరికం వెంటాడుతున్నా ఆ యువతి వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ స్కూల్‌లో చదివి స్కాలర్‌షిప్‌లతో ఉన్నత విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత HYDలో హోం ట్యూషన్స్ చెబుతూ కోచింగ్ తీసుకోకుండానే 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. సూర్యాపేట(D) పాతదొనబండ తండాకు చెందిన భూక్యా మౌనిక విజయ గాథ ఇది. రైల్వేలో క్యారేజ్& వ్యాగన్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గ్రూప్-4 ఆరో ర్యాంక్, పంచాయతీరాజ్ శాఖలో AEEగా ఈమె ఎంపికయ్యారు.
ఏ దేశానికైనా నదులు జీవనాధారం. కానీ ఒక్క నదీ లేని దేశాలు ప్రపంచంలో 19 ఉన్నాయి. వరల్డ్ అట్లాస్ వెబ్‌సైట్ ప్రకారం.. సౌదీ అరేబియా, UAE, ఒమన్, ఖతర్, కువైట్, యెమెన్, కొమొరోస్, డిజిబౌటీ, లిబియా, బహమాస్, బహ్రెయిన్, మాల్దీవులు, మాల్టా, మొనాకో, వాటికన్ సిటీ, కిరిబాటీ, నారు, తువాలూ, టోంగా దేశాల్లో నదులు లేవు. వీటిలో కొన్ని ఎడారి దేశాలు కాగా మరికొన్ని ద్వీపాలు.
ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జైలులో ఉండి 17 నెలలు గడిచినా విచారణ జరక్కపోవడంతో అప్పీలుదారు సత్వర విచారణ హక్కును కోల్పోయారని కోర్టు అభిప్రాయపడింది. శిక్షగా బెయిల్ నిలుపుదల చేయకూడదనే విషయాన్ని కోర్టులు మర్చిపోయినట్టున్నాయని వ్యాఖ్యానించింది. బెయిల్ అనేది నియమం అని, జైలు మినహాయింపుగా అభివర్ణించింది.
రోజంతా అలుపెరగకుండా పనిచేసే మన అవయవాలకు నిద్రపోయినప్పుడే తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అందుకే కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఆ నిద్ర కూడా లేకపోతే డయాబెటిస్, హృద్రోగాలు, బీపీ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. డిప్రెషన్ ముప్పుతో పాటు అకాల మరణం పొంచి ఉంటుంది’ అని నేషనల్ స్లీప్ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ జేసీ సూరి హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.