India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ‘విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనంపై దాడి చేయడం దారుణం. చంద్రబాబు, లోకేశ్ ప్రమేయంతోనే ఈ దాడి జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిని కూలగొట్టాలని ప్రయత్నించారు. ఇప్పుడు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
TG: ‘ధరణి’లో భూమి రిజిస్టర్ కాలేదనే మనస్తాపంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు రాజేశ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. జక్రాన్‌పల్లి మం. అర్గుల్‌కు చెందిన రాజేశ్ వ్యవసాయంతో పాటు వ్యాపారంలో రూ.12 లక్షలు నష్టపోయాడు. తన 2 ఎకరాల భూమిని అమ్మేసి బాకీని తీర్చాలని ప్రయత్నించాడు. ధరణి పోర్టల్‌లో భూమి నమోదు కాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
AP: టీడీపీ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని CM చంద్రబాబు విమర్శించారు. విజయవాడలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆదివాసీలు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష. ఏకలవ్యుడు, అల్లూరి, టీచర్ నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపదీ ముర్మును ఆదర్శంగా తీసుకుని రాణించాలి’ అని పిలుపునిచ్చారు.
ఆడపిల్లల కనీస వివాహ వయసును 9 ఏళ్లకు తగ్గించేలా ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు దుమారం రేపుతోంది. ప్రస్తుతం కనీస వయసు 18 ఏళ్లుగా ఉంది. బిల్లు పాసైతే 15 ఏళ్లకే బాలురికి, 9 ఏళ్లకే బాలికలకు వివాహం చేసేయొచ్చు. దీనిపై హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. అమ్మాయిలు చిన్నవయసులోనే తప్పుదోవ పట్టకుండా బిల్లు ఉపకరిస్తుందని కొంతమంది MPలు చెబుతున్నారు.
TG: రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో బీజేపీ అధిష్ఠానం సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించిన హైకమాండ్, అధ్యక్ష బాధ్యతలను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల, అరవింద్ ముందువరసలో ఉన్నట్లు తెలుస్తోంది.
<<13811383>>లాపతా లేడీస్<<>> అంటే ‘తప్పిపోయిన స్త్రీలు’. చదువుకోవాలనే కోరిక ఉన్నా ఇష్టంలేని పెళ్లి చేసుకున్న ఓ యువతి, కట్టుకున్న వాడి ఊరు, పేరు తెలియని మరో అమాయకురాలి కథ ఇది. రైలులో ప్రయాణిస్తూ భార్యల తలపై కొంగు వల్ల ఓ వ్యక్తి మరో మహిళను ఇంటికి తీసుకెళ్తాడు. అసలు భార్య స్టేషన్‌లో ఉండిపోతుంది. వాళ్లు మళ్లీ ఎలా కలిశారు? మనసులు కలవని, మనుషులు తెలియని మనువులతో ఇబ్బందులు, లింగ సమానత్వ అవసరాన్ని చక్కగా చూపించారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఢిల్లీ పోలీసులు కరుడుగట్టిన ఐసిస్ మాడ్యూల్ టెర్రరిస్టు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీని అరెస్టు చేశారు. అతనిపై NIA గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసి రూ.3 లక్షల రివార్డు ప్రకటించింది. గతంలో పూణె పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న రిజ్వాన్ తాజాగా ఢిల్లీలోని దర్యాగంజ్‌లో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కమల్ హాసన్ హీరోగా నటించిన‘ భారతీయుడు 2’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. శంకర్ రూపొందించిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత కలెక్షన్లు రాబట్టలేదని తెలుస్తోంది.
నిన్న కన్నుమూసిన బుద్ధదేవ్ భట్టాచార్య 11ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేశారు. జీవితమంతా కమ్యూనిజం విలువలతో బతికిన ఆయన మరణానంతరమూ వాటినే అనుసరించారు. ఎటువంటి అంతిమ సంస్కారాలూ వద్దని ముందుగానే నిర్ణయించుకున్నారు. అవయవాలను దానానికి, శరీరాన్ని పరిశోధనలకు ఇచ్చేశారు. దీంతో ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ కుటుంబీకులు NRS మెడికల్ కాలేజీ-ఆస్పత్రికి బుద్ధదేవ్ మృతదేహాన్ని ఈరోజు అప్పగించనున్నారు.
TG: <<13805045>>సుంకిశాల<<>> ఘటనపై ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుంకిశాల విపత్తు విషయం ప్రభుత్వానికి తెలియదా? తెలిస్తే ఎందుకు వారం రోజులు గోప్యత పాటించారు? తెలియకపోతే అది ప్రభుత్వానికే సిగ్గుచేటు. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి. దీనికి వందశాతం సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.