News January 30, 2025
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ రిజిస్ట్రేషన్ కోసం పూజారి NOC తప్పనిసరి

ఉత్తరాఖండ్‌లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు UCC నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం 15 రకాల డాక్యుమెంట్లు (ఆధార్, నివాస, వయసు నిర్ధారణ వంటివి) సమర్పించాలి. అలాగే ఒక పూజారి నుంచి NOC తీసుకోవాలి. 16 పేజీల ఫాం నింపి ₹500 ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. రిలేషన్‌లో ఉన్నవారి వయసు 21 ఏళ్లకు తక్కువ ఉంటే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు.
Similar News
News February 13, 2025
కల్తీ నెయ్యి కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతిచ్చింది. నిందితులు శ్రీవైష్ణవి డెయిరీ డైరెక్టర్లు వివేక్ జైన్, పోమిల్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, అపూర్వ చావ్డాలను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అదేరోజు కోర్టులో హాజరుపరిచారు.
News February 13, 2025
మధురైలో పవన్‌ను కలిసిన OG సినిమాటోగ్రాఫర్

తమిళనాడులో పర్యటిస్తున్న Dy.CM పవన్ కళ్యాణ్‌ను మధురైలో ‘OG’ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు అకీరా నందన్‌ను పవర్ స్టార్ పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా OG చిత్రాన్ని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.
News February 13, 2025
వంశీపై ముగిసిన విచారణ.. ఆస్పత్రికి తరలింపు

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కృష్ణలంక స్టేషన్లో పోలీసుల విచారణ ముగిసింది. 8గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన్ను పీఎస్ నుంచి ప్రభుత్వాసుపత్రికి(జీజీహెచ్)కు వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. అనంతరం మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.