India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభాస్‌కు తన స్టార్‌డమ్ గురించి తెలియదు. నాకు తెలిసినంత వరకూ ఆయన సోషల్‌మీడియా కూడా ఉపయోగించరు. ప్రైవేట్ పర్సన్. అత్యంత సన్నిహితులతోనే అన్ని విషయాలు పంచుకుంటారు. సలార్ వల్ల ప్రభాస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, త్వరలోనే ‘సలార్-2’ షూటింగ్ మొదలవనుంది.

కుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందిన వారి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. కుంభమేళాకు వచ్చిన అనేక మంది ఆచూకీ దొరక్క బంధుమిత్రులు ఆందోళన పడుతున్నారని, తొక్కిసలాట సందర్భంగా వారికేమైనా జరిగిందేమో అని భయపడుతున్నట్లు చెప్పారు. మృతుల వివరాలను వెల్లడించడం వల్ల అందుబాటులోకిరాని ఆప్తుల ఆచూకీపై కుటుంబసభ్యులకు అనవసర భయాలు తొలగుతాయని పేర్కొన్నారు.

AP: రాష్ట్రంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ.44,776cr పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో ఏర్పాటు చేయనున్న 2,300MW విద్యుత్ ప్రాజెక్టుకు SIPB ఆమోదం లభించింది. దీంతో పాటు ఇతర ప్రాజెక్టులు CM చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశంలో ఆమోదం పొందాయి.

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సూపర్ స్టార్ హోదాలో ఉన్నా ఆయనలో ఎలాంటి మార్పు లేదని అరుణ్ జైట్లీ స్టేడియం క్యాంటిన్ హెడ్ చెప్పారు. యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారన్నారు. తమ పట్ల అదే గౌరవం, ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్నారు. కాగా రైల్వేస్‌తో జరుగుతున్న రంజీ మ్యాచులో ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

శ్రీలంకపై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి టెస్టులో రెండో రోజు ఆసీస్ స్కోర్ 600కు చేరింది. ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేశారు. వీరిలో ఖవాజా(232) డబుల్ సెంచరీ చేయగా స్మిత్(141), ఇంగ్లిస్(102) శతకాలు బాదారు. శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉంచాలని ఆసీస్ 4.2 రన్‌రేట్‌తో ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరుతో స్మిత్ ఈ సిరీస్‌కు సారథిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం AUS స్కోర్ 600/5.

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ‘SSMB29’ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చక్కర్లు కొడుతోంది. ఈ చిత్ర షూటింగ్ కెన్యా అడవుల్లో నిర్వహించేందుకు జక్కన్న ప్లాన్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీ కూడా ఆయన ఎంచుకున్న లొకేషన్స్‌లో ఒకటని వెల్లడించాయి. కాగా, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణితో రాజమౌళి, హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఉన్న ఫొటో వైరలవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ కూడా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.170 పెరిగి రూ.83,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.76,100గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై రూ.2వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ రేట్ రూ.1,06,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

అత్యాచారం కేసులో UPలోని సీతాపూర్ కాంగ్రెస్ MP రాకేశ్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నాలుగేళ్లుగా రాకేశ్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆయనపై ఈనెల 17న కేసు నమోదు చేశారు. రాకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ HC నిన్న కొట్టేసింది. కేసు సెటిల్ చేసుకుందామని రాకేశ్ ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి భర్త ఆరోపించారు.

పుష్ప-2 మూవీ అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్‌ను మరింత పెంచేందుకు OTT సంస్థ మాస్ ఎలివేషన్లు ఇస్తోంది. తన అధికారిక ఇన్‌స్టా, X అకౌంట్‌ల బయోలో ‘ఈ పేజీ పుష్ప పాలనలో ఉంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఇన్నాళ్లూ థియేటర్లలో కొనసాగిన పుష్ప గాడి హవా ఓటీటీలోనూ కంటిన్యూ అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 3.44 గంటల నిడివితో మూవీ అందుబాటులో ఉంది.

మీ ఇంట్లో ముగ్గురు పిల్లలున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించే ఉంటారు. ముగ్గురిలో మధ్యలో ఉన్న పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారని పరిశోధనలో తేలింది. వీరు తోబుట్టువులతో ఎంతో నిజాయతీగా, వినయంతో ఉంటారని, అంగీకారయోగ్యమైన వారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారు గొడవలు జరగకుండా చూస్తూ కుటుంబ వ్యవహారాలను సమతుల్యం చేస్తారని తెలిపాయి. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.