News January 30, 2025
మృతుల వివరాలు వెల్లడించండి: అఖిలేశ్

కుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందిన వారి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. కుంభమేళాకు వచ్చిన అనేక మంది ఆచూకీ దొరక్క బంధుమిత్రులు ఆందోళన పడుతున్నారని, తొక్కిసలాట సందర్భంగా వారికేమైనా జరిగిందేమో అని భయపడుతున్నట్లు చెప్పారు. మృతుల వివరాలను వెల్లడించడం వల్ల అందుబాటులోకిరాని ఆప్తుల ఆచూకీపై కుటుంబసభ్యులకు అనవసర భయాలు తొలగుతాయని పేర్కొన్నారు.
Similar News
News February 10, 2025
రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 9, 2025
ఇంగ్లండ్ చెత్త రికార్డు

వన్డేల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 300కు పైగా స్కోర్ చేసి అత్యధిక సార్లు పరాజయం పాలైన జట్టుగా నిలిచింది. 99 మ్యాచుల్లో 28 సార్లు ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్(27), వెస్టిండీస్(23), శ్రీలంక(19) ఉన్నాయి. వన్డే WC 2023 తర్వాత ఇంగ్లండ్‌కు ఇది వరుసగా నాలుగో సిరీస్ ఓటమి.
News February 9, 2025
మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్లే…

మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా.. అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.