News August 6, 2024

CID చేతికి మదనపల్లె ఫైళ్ల దహనం కేసు

image

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు విచారణ చేసిన కేసు మొత్తం వివరాలను సీఐడీకి పోలీసులు అప్పగించనున్నారు. గత నెల 21న రాత్రి కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం అయ్యాయి. ఈ ఘటనపై పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

News August 6, 2024

యూరప్ ట్రిప్‌లో రోజా.. ఫొటో వైరల్!

image

AP మాజీ మంత్రి రోజా యూరప్‌ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె ఇటలీలో ఉన్నారంటూ రోజా ఫొటోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా.. నగరి MLAగా ఓడిపోవడంతో పాటు YCP అధికారం కోల్పోవడంతో కాస్త సైలెంట్ అయ్యారు. అయితే రాష్ట్రంలో YCP శ్రేణులపై దాడులు జరుగుతుంటే అండగా ఉండాల్సింది పోయి విదేశాల్లో ఎంజాయ్ చేస్తారా? అని సొంత పార్టీ నేతలే ఆమెపై గుర్రుగా ఉన్నారట.

News August 6, 2024

కేటీఆర్‌పై FIR నమోదు

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 26న అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్‌పై BRS శ్రేణులు డ్రోన్ ఎగరేసిన ఘటనపై ఇరిగేషన్ అధికారి షేక్ వలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.

News August 6, 2024

నీరజ్ మరో 1.25మీ విసిరితే ఒలింపిక్స్ రికార్డు బద్దలే

image

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు మరో గోల్డ్ ఖాయమే అనిపిస్తోంది. అర్హత పోటీల్లో అతడు ఈటెను 89.33 మీటర్లు విసిరి No.1గా అవతరించారు. 2, 3 స్థానాల్లోని పీటర్స్ అండర్సన్ 0.71, జూలియన్ వెబర్ 1.58 మీ.లతో వెనకబడ్డారు. అంటే నీరజ్ ఫైనల్లో ఈ ప్రదర్శనే రిపీట్ చేసినా ఏదో ఓ పతకం వస్తుంది. ఇక ఒలింపిక్స్ బెస్ట్ 90.57మీ.తో పోలిస్తే అతడు 1.24మీ. వెనకబడ్డారు. అతడా రికార్డు బద్దలు కొట్టాలన్నదే భారతీయుల కోరిక. మీ Comment

News August 6, 2024

జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా జగన్‌కు అభద్రతే: లోకేశ్

image

AP: జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా మాజీ సీఎం జగన్‌కు అభద్రతాభావం పోలేదని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. ‘ప్రస్తుతం జగన్‌కు 58 మంది సెక్యూరిటీ, 10 మంది సాయుధ గార్డులు, రెండు ఎస్కార్ట్ టీమ్స్, రెండు ల్యాండ్ క్రూయిజర్, బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారు?’ అని లోకేశ్ ప్రశ్నించారు.

News August 6, 2024

‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ట్రైలర్ రేపు సాయంత్రం 7:11 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగస్టు 15న మూవీ విడుదల కానుంది.

News August 6, 2024

తెలంగాణలో స్వచ్ఛ్ బయో సంస్థ పెట్టుబడులు

image

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా CM రేవంత్ US పర్యటన కొనసాగుతోంది. తాజాగా CMతో స్వచ్ఛ్ బయో సంస్థ ఛైర్మన్ ప్రవీణ్ భేటీ అయ్యారు. TGలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయన అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో జీవఇంధన ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటు అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్‌లో కీలకమైన ఆర్సీజియం సంస్థ HYDలో తమ కంపెనీ విస్తరణకు ప్రభుత్వంతో MOU చేసుకుంది.

News August 6, 2024

OLYMPICS: 40 మంది క్రీడాకారులకు కొవిడ్

image

పారిస్ ఒలింపిక్స్‌లో కొవిడ్-19 కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్‌ వచ్చినట్లు WHO రిపోర్టుల్లో తేలింది. బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ, ఆస్ట్రేలియా రన్నర్ లానీ పాలిస్టర్ తదితరులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒలింపిక్స్ ముగింపునకు మరికొన్ని రోజులు ఉండటంతో కేసుల సంఖ్య పెరగొచ్చని WHO అంచనా వేస్తోంది.
<<-se>>#Olympics2024<<>>

News August 6, 2024

గెలిచేందుకు నా శాయశక్తులా పోరాడా: లక్ష్యసేన్

image

పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తన ఓటమిపై తాజాగా స్పందించారు. ‘ఈ ఒలింపిక్స్‌ ప్రయాణం నా గౌరవాన్ని పెంచింది. అలాగే నా హృదయాన్ని ముక్కలు చేసింది. గెలిచేందుకు శాయశక్తులా ప్రతి ఔన్సు బలంతో పోరాడాను. కానీ విజయానికి కాస్త దూరంలో పడిపోయాను’ అని ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.

News August 6, 2024

YS జగన్‌కు ఏమైంది?: TDP

image

AP: ఈ జగన్‌కు ఏమైందంటూ టీడీపీ Xలో వ్యంగ్యంగా స్పందించింది. ప్రతిపక్ష హోదా లేదు కానీ హోదా కావాలని, సీఎం పదవి లేదు కానీ ఆ స్థాయి సెక్యూరిటీ కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని ఎద్దేవా చేసింది. ‘నిన్నటి వరకు ప్రతిపక్ష హోదా, ఇవాళ సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలంటున్నాడు. అయ్యా సైకియాట్రిస్టులు తన పొజిషన్ ఏంటో ఆయనకు అర్థమయ్యేలా చెప్పండయ్యా’ అని TDP సెటైర్లు వేసింది. ఈ ట్వీట్‌పై YCP ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.