News January 18, 2025

శుభ ముహూర్తం (18-01-2025)

image

✒ తిథి: బహుళ పంచమి
✒ నక్షత్రం: పుబ్బ మ.3.01 వరకు
✒ శుభ సమయం: ఉ.11.32-12.08 వరకు
2. సా.4.32-5.20 వరకు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: రా.10.38-12.22 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.8.18-10.00 వరకు

News January 18, 2025

TODAY HEADLINES

image

✒ FEB 1న కేంద్ర బడ్జెట్.. 2 విడతలుగా సమావేశాలు
✒ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ₹11,440Cr ప్యాకేజీ
✒ AP: తనతో భేటీకి MPల గైర్హాజరు.. CBN ఆగ్రహం
✒ AP: పేదలకు పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు
✒ IPS సునీల్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
✒ సింగపూర్ మినిస్టర్‌తో CM రేవంత్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
✒ 100% రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా: KTR
✒ పాత రేషన్ కార్డులు తొలగించం: మంత్రి పొన్నం

News January 18, 2025

పెళ్లి చేసుకున్న శ్రీలంక క్రికెటర్

image

శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి అర్తికా యోనాలీని వివాహం చేసుకున్నారు. కొలొంబో వేదికగా జరిగిన ఈ వేడుకకు ఆ దేశ క్రికెటర్లు హాజరయ్యారు. IPL-2023, 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను 27 మ్యాచ్‌లలో 25 వికెట్లు తీశారు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్‌కు ఆడనున్నారు. శ్రీలంక తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 135 వికెట్లు పడగొట్టారు.

News January 18, 2025

పూర్తిగా కోలుకున్న విశాల్

image

ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్‌లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.

News January 18, 2025

ఎంపీతో రింకూ ఎంగేజ్‌మెంట్‌లో ట్విస్ట్!

image

రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్‌ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్‌మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.

News January 17, 2025

మహాకుంభమేళాలో శ్రీవారికి గంగా హారతి

image

మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌లో తిరుమల శ్రీవారికి గంగా హారతిని అర్చకులు సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల నడుమ శ్రీనివాసుడి ప్రతిమను ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.

News January 17, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో మహేశ్ బాబు

image

చాలారోజుల తర్వాత విక్టరీ వెంకటేశ్, ప్రిన్స్ మహేశ్ బాబు ఒకేచోట చేరి సందడి చేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్ అయింది. అప్పటి నుంచి వెంకీ, మహేశ్‌ను పెద్దోడు, చిన్నోడు అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో చిన్నోడు మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ Xలో పోస్ట్ చేశారు.

News January 17, 2025

సీఎం చంద్రబాబు సీరియస్

image

AP: తనతో సమావేశానికి కొందరు ఎంపీలు హాజరుకాకపోవడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమైన భేటీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. వచ్చే సమావేశానికి ఇది రిపీట్ కాకూడదని చెప్పారు. జిల్లా అభివృద్ధి బాధ్యత MP, ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్, జిల్లా మంత్రిదేనని స్పష్టం చేశారు. కొందరు MLAలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఎంపీ, ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని సీఎం తేల్చి చెప్పారు.

News January 17, 2025

‘సంచార్ సాథీ’ యాప్ ప్రారంభం.. ఉపయోగాలివే

image

స్కామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు వీలుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ‘సంచార్ సాథీ’ యాప్‌ను ఆవిష్కరించారు. మీకు ఏవైనా అనుమానిత కాల్స్‌ వస్తే ఈ యాప్‌లో లాగినై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ పోయినప్పుడు వెంటనే బ్లాక్ చేసే వీలుంది. మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకుని, అనధికార నంబర్లపై ఫిర్యాదు చేసే వీలుంది. IMEI నంబర్ ఎంటర్ చేసి మొబైల్ ప్రామాణికతను కూడా గుర్తించొచ్చు.

News January 17, 2025

మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు

image

HYD మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు దక్కింది. వీటిని న్యూయార్క్‌కు చెందిన వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్ ‘వరల్డ్ మోనుమెంట్స్ వాచ్-2025’ జాబితాలో చేర్చింది. హైకోర్టు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజ్, ఉమెన్స్ యూనివర్సిటీ వీటిలో ఉన్నాయి. కాగా కళ కోల్పోయిన ఈ చారిత్రక భవనాలకు సీఎం రేవంత్ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పునర్వైభవం రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.