News November 7, 2024

ధ్రువ్ జురెల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్

image

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జట్టు 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్లు తీశారు.

News November 7, 2024

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు అదిరిపోయే న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1790, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.1650 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.78,560కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.72,000గా నమోదైంది. ఇక వెండి ధర కిలోపై రూ.3000 తగ్గి రూ.1,02,000గా ఉంది.

News November 7, 2024

కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు

image

TG: కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ కాంట్రాక్టును GOVT రద్దు చేసింది. ఆరేళ్ల నుంచి పనులు ప్రారంభించకపోవడంతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. గోదావరి ఫేజ్-2లో భాగంగా HYD తాగునీటి అవసరాల కోసం శామీర్‌పేట సమీపంలో దీనిని నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉస్మాన్‌‌సాగర్, హిమాయత్ సాగర్ వరకు స్కీమ్‌ను పొడిగించి HYDకు నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు GOVT తెలిపింది.

News November 7, 2024

కేసీఆర్‌పై కక్షగట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: KTR

image

TG: రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా? విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో ఏం చేశారు? కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?’ అని ప్రశ్నించారు.

News November 7, 2024

మధ్యాహ్నం జగన్ కీలక ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై నమోదవుతున్న కేసులపై స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా వారం రోజుల్లోనే 107 మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.

News November 7, 2024

ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు

image

AP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 1,732 మందికి లబ్ధి చేకూర్చనుంది. ఈ నెల 10లోగా అర్హులను ఎంపికచేయాలని అధికారులను ఆదేశించింది. నర్సరీ, విత్తనాల తయారీ, ఆటో కొనుగోలు, ఫొటో స్టూడియో, బ్యూటీ పార్లర్, చిన్న దుకాణాల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల రుణం ఇస్తారు. ఇందులో రూ.50వేల రాయితీ ఉంటుంది. వడ్డీ చెల్లింపుపై త్వరలో క్లారిటీ రానుంది.

News November 7, 2024

రికార్డు సృష్టిస్తోన్న ‘పుష్ప-2’

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీ విడుదలకు ఇంకా 30 రోజులు ఉన్నప్పటికీ అప్పుడే ఆఫ్ మిలియన్ క్రాస్ చేసిందన్నారు. విడుదల తేదీ నాటికి రికార్డు ప్రీ కలెక్షన్లు సాధిస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

News November 7, 2024

Stock Markets: నిన్నటి లాభాల్లో సగం పోయె..

image

భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. క్రూడాయిల్ ధరల పెరుగుదల, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 79,927 (-450), నిఫ్టీ 24,360 (-123) వద్ద ట్రేడవుతున్నాయి. మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, Oil & Gas సూచీలు పుంజుకున్నాయి. మెటల్, ఫార్మా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. హిందాల్కో, Adani Ent, సిప్లా, అల్ట్రాటెక్ సెమ్ టాప్ లూజర్స్.

News November 7, 2024

‘ఘాటి’లో అనుష్క వైల్డ్ లుక్

image

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇవాళ జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సిగార్ పీలుస్తూ ఆగ్రహంతో ముఖం నిండా రక్తంతో ఉన్న ఆమె వైల్డ్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదం’ తర్వాత వారి కాంబోలో తెరకెక్కుతున్న రెండో మూవీ ఇది. ఇవాళ సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది.

News November 7, 2024

20 పరుగుల తేడాతో 10 వికెట్లు

image

రంజీ ట్రోఫీలో భాగంగా J&Kతో జరుగుతున్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ కుప్పకూలింది. 53/0 స్థితి నుంచి 73 పరుగులకే ఆలౌటైంది. 20 పరుగుల తేడాతో 10 మంది బ్యాటర్లు ఔటయ్యారు. నలుగురు డకౌట్ కాగా, మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్లు బమంబా 21, అర్పిత్ 24 రన్స్ చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి.