India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: హామీల అమలుపై శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, YCP MLC బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేయలేదని బొత్స అనడంపై మంత్రి మండిపడ్డారు. ‘సూపర్ సిక్స్ హామీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హామీలు అమలు చేయలేని వారు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు’ అని అన్నారు. ‘హామీలపై అడిగితే అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఎవరికి సిగ్గులేదో ప్రజలందరికీ తెలుసు’ అని బొత్స బదులిచ్చారు.

దేశంలో కార్పొరేట్ ఉద్యోగాల్లోనే కాకుండా నాయకత్వ స్థానాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. 2016లో 13% కార్పొరేట్ కంపెనీలకు లేడీ బాస్‌లు ఉండగా ఇప్పుడది 20 శాతానికి పెరిగినట్లు ‘అవ్‌తార్’ సంస్థ సర్వే వెల్లడించింది. ఇక వివిధ స్థాయి ఉద్యోగాల్లో 35.7% మంది, ప్రొఫెషనల్ రంగంలో 44.6%, ITESలో 41.7%, ఫార్మాలో 25 శాతం, FMCGలో 23%, తయారీ రంగంలో 12 శాతం మంది అతివలే ఉన్నారని పేర్కొంది.

AP: అన్నమయ్య జిల్లాలో 10 రోజుల క్రితం టన్ను అరటి ధర రూ.15-18వేలు పలకగా.. ప్రస్తుతం రూ.5-రూ.7వేలకు పడిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర లేక.. రవాణా ఖర్చులు భరించలేక పండిన పంటను చెట్లకే వదిలేస్తున్నామని రైతులు చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో వర్షాలు, ఇతర కారణాలతో అక్కడి వ్యాపారులు కొనుగోలుకు రావడం లేదని.. పండుగ సీజన్ వల్ల ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

AP: వైరల్ ఫీవర్ సోకిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతరం ఆయన అస్వస్థత చెందగా గత 4 రోజులుగా విజయవాడలోనే వైద్యం చేయించుకొంటున్నారు. అయితే ఫీవర్ తీవ్రత తగ్గకపోవడం, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు HYDలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని వివరించాయి.

భారీ బడ్జెట్‌తో రూపొందించిన పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రాన్ని రిలీజైన ఒక్కరోజులోనే పైరసీ లింక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సైట్లలో HD ప్రింట్ అందుబాటులోకి రావడంతో పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని, ఇది థియేటర్లలో చూడాల్సిన మూవీ అంటున్నారు. పైరసీ చేసినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సినీ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

AP: మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన 5 కీలక MNP చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో నాలా చట్టం రద్దయి దాని స్థానంలో ఇకపై అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలు చేయనున్నారు. బహుళ అంతస్తుల భవనాల ఎత్తు 24 మీటర్ల వరకు అనుమతిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగులను క్రమబద్ధీకరించనున్నారు. వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరును తాడిగడప మున్సిపాల్టీగా మార్చేందుకు సభ ఆమోదం తెలిపింది.

AP: ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని YCP MLC వరుదు కళ్యాణి మండలిలో డిమాండ్ చేశారు. ‘సూపర్-6 సూపర్ హిట్టా.. సూపర్ ఫ్లాపా అర్థం కావట్లేదు. ఫ్లాప్ సినిమాకు టూర్లు నిర్వహిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా సంబరాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్-6 హామీలను మార్చేసి అన్నీ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మ్యానిఫెస్టోను ఛేంజ్ చేసే అలవాటు టీడీపీకి ఉంది’ అని ఆమె ఆరోపించారు.

TG పల్లెల్లో పొలిటీషియన్స్ డైలమాలో పడ్డారు. ఓవైపు వైన్స్ టెండర్ల ప్రకటన వచ్చింది. మరోవైపు రేపోమాపో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో లాస్ అంటూ ఉండని, ‘పైసా’ వచ్చే వైన్స్ కోసం డబ్బు పెట్టాలా? లేక లోకల్ పోరులో గెలిస్తే వచ్చే ‘పవర్&పైసా’ వైపు మొగ్గాలా? అని లెక్కలేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పోటీకి సై అంటూనే కనీసం ఓ షాపుకైనా టెండర్ వేయాలని మనీ సెట్ చేసుకుంటున్నారు.

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరును BRS అధినేత కేసీఆర్ ప్రకటించారు. గోపీనాథ్ అకాల మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే సునీతతో పాటు ఆమె కుమార్తెలు నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవాళో, రేపో కాంగ్రెస్ సైతం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.

‘జాక్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడంతో రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చినట్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను నటించిన జాక్ బాగా ఆడకపోవడంతో ఎవరూ నష్టపోవద్దని అనుకున్నా. అందుకే రూ.4.75కోట్లు తిరిగి ఇచ్చా. దీనికోసం అప్పు చేయాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా అప్పును తీర్చేయాలనే ఆందోళన ఒక్కటే నాకు ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్ తిరిగివ్వడంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.