India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్ షూటింగ్లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ తెలిపింది. రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని చెప్పింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

TG: CM రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో పలు అంశాలపై మాట్లాడారు. ‘నేను కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఒప్పుకోను. KCR, KTR, హరీశ్‌రావు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను CBIకి అప్పగించి చాలా రోజులైనా కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? KTR ఏం చెప్తే కిషన్‌రెడ్డి అది చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.

ఆసియాలోనే తొలిమహిళా లోకో పైలెట్ అయిన సురేఖయాదవ్ ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను డిపార్ట్మెంట్ సిబ్బంది, కుటుంబసభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఘనంగా సత్కరించారు. 1988లో ఉద్యోగంలో చేరిన సురేఖ గూడ్స్ రైళ్ల నుంచి ముంబైలోని ఐకానిక్ లోకల్ రైళ్లు, ప్రతిష్ఠాత్మక దక్కన్ క్వీన్ నుంచి ఆధునిక వందే భారత్ వరకు అన్ని రైళ్లను నడిపిన మొదటి మహళా లోకోపైలెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

TG: HYD అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను MBA(హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24న ఉదయం 9 గంటలకు CSTD బిల్డింగ్‌లో కౌన్సెలింగ్ ఉంటుందని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఐసెట్ లేదా వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో పాసైనవారే అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.braouonline.in సంప్రదించాలన్నారు.

వాతావరణ మార్పులతో తొలి రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేల సమాచారం, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో ఒత్తిడిని పెంచి, హార్మోన్లను ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.

తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ పాటిస్తాం’ అని ఇటీవల అభయ్(సోనూ) పేరుతో లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతమంటూ మావోల అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నానని సోనూ ఎందుకు ప్రకటించాడో అర్థం కావట్లేదన్నారు. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. APలో ఈనెల 22-OCT2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 21-OCT3 వరకు సెలవులిచ్చారు.

TG: దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు <<17756948>>సవరించడంపై<<>> BRS నేత హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘పండుగలు వస్తే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50% అదనంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు బతుకమ్మ, దసరా సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఇదేనా ప్రభుత్వ వైఖరి?’ అని ప్రశ్నించారు.

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) పోస్టులకు ఈ నెల 26 వరకు <
#ShareIt

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కేరళకు చెందిన 71 ఏళ్ల లీలా జోస్ నిరూపించారు. ఇడుక్కి జిల్లా, కొన్నతడికి చెందిన లీలకు స్కైడైవింగ్ చేయాలని కోరిక. తాజాగా దుబాయ్ వెళ్లిన ఆమె అనుభవజ్ఞుడైన శిక్షకుడితో కలిసి 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేశారు. కేరళలో ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ‘గాల్లో తేలిపోతున్నప్పుడు భయం, ఆనందం రెండూ కలిగాయి.’ అని లీల తన అనుభవాన్ని వివరించారు.
Sorry, no posts matched your criteria.