News November 6, 2024

అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు!

image

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రపంచ నలుమూలల క్రేజ్ ఉంటుంది. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది రుజువైంది. ఎన్నికల్లో ఒక ఓటరు తన ఓటును బాలయ్యకు వేశారు. ఏ అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేస్తారనే విభాగంలో ఇష్టమైన వ్యక్తి పేరు రాసి ఓటు వేసే అవకాశం ఉండటంతో సదరు వ్యక్తి ‘బాలయ్య’ అని రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

News November 6, 2024

మిస్టీరియస్.. ఈ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే!

image

భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్‌కుండ్ లేక్ (స్కెలిటెన్ లేక్). ఉత్తరాఖండ్‌‌లోని హిమాలయ శ్రేణుల్లో 16,740 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. దీని అంచున మానవ అస్థిపంజరాలు ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి 800CE-1800 CEకి చెందిన మానవ అవశేషాలుగా గుర్తించారు. ఈ మరణాలకు గల కచ్చితమైన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. తుఫాను లేదా యుద్ధ సమయంలో వీరు చనిపోయి ఉండొచ్చని అంచనా.

News November 6, 2024

తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బీఆర్ నాయుడు

image

AP: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.

News November 6, 2024

యువరాజ్ గర్వపడేలా ఆడేందుకు యత్నిస్తా: అభిషేక్

image

తన మెంటార్ యువరాజ్ సింగ్ గర్వపడేలా దక్షిణాఫ్రికాతో జరిగే T20 సిరీస్‌లో ఆడతానని భారత బ్యాటర్ అభిషేక్ శర్మ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. 2007లో యువీ 6 సిక్సులు కొట్టిన డర్బన్‌ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యువీ ఇన్నింగ్స్‌ను బీసీసీఐ ఇంటర్వ్యూలో అభిషేక్ గుర్తుచేసుకున్నారు. తాను ఇంటి నుంచి ఆ మ్యాచ్ చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు.

News November 6, 2024

BREAKING: రాష్ట్రంలో నిలిచిన మద్యం సరఫరా

image

TG: సర్వర్ ప్రాబ్లమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. కాగా రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.

News November 6, 2024

రేపు అనుష్క మూవీ అప్డేట్స్

image

హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.

News November 6, 2024

ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా పాక్ ప్లేయర్

image

పాకిస్థాన్ ఆటగాడు నోమన్ అలీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా ఎంపికయ్యారు. అతడితోపాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను కూడా నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో నోమన్ అలీ విశేషంగా రాణించారు. మొత్తం 20 వికెట్లు పడగొట్టి మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించారు.

News November 6, 2024

రేపు ఈ జిల్లాలో వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News November 6, 2024

WALKING: ఉదయమా.. సాయంత్రమా.. ఎప్పుడు నడవాలి?

image

ప్రతి రోజూ కనీసం 8 వేల అడుగులైనా వేస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున నడిస్తే మనసు ఆహ్లాదపడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. అలాగే సాయంత్రం వాకింగ్ చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గి రాత్రి మంచి నిద్ర పడుతుంది. కాగా ఉదయం నడిచినా, సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మేలే. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వాకింగ్ చేయండి.

News November 6, 2024

పవన్‌ను తిట్టించింది చంద్రబాబే: విజయసాయి

image

AP: సీఎం చంద్రబాబు మందకృష్ణ మాదిగతో పవన్ కళ్యాణ్‌ను తిట్టించారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ‘చంద్రబాబును కలిసి ఆయనతో ఒక గంట మాట్లాడిన తరువాత మందకృష్ణ మాదిగ బయటకు వచ్చి పవన్‌ను తిట్టారు. దీనిపై పవన్ అభిమానులకు సందేహం రాలేదా? కృష్ణ మాదిగను తిడుతున్నారు కానీ ఆయన చేత పవన్‌ను తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడం లేదు. అదే చంద్రబాబు మార్క్ రాజకీయం’ అని ట్వీట్ చేశారు.