News November 7, 2024

తలైవాస్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తెలుగు టైటాన్స్

image

ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన తమిళ్ తలైవాస్‌పై గెలిచి బదులు తీర్చుకుంది. ఈరోజు గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 34-35 తేడాతో టైటాన్స్ గెలుపొందింది. కాగా ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన టైటాన్స్ 4 గెలిచి 4వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో పుణేరి పల్టాన్స్(7లో 5 గెలుపు) ఉండగా చివరి స్థానంలో గుజరాత్ జెయింట్స్(5లో ఒక గెలుపు) ఉన్నాయి.

News November 6, 2024

అకౌంట్లలోకి డబ్బులు.. కీలక ప్రకటన

image

AP: ఈ విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమచేసేలా పాత పద్ధతిని అవలంబిస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. బకాయిలు రూ.3,500 కోట్లు విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాలేజీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు తల్లుల ఖాతాల్లో డిపాజిట్ అయ్యేవి.

News November 6, 2024

మళ్లీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్

image

ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీని చేపట్టారు. బాల్ టాంపరింగ్ కారణంగా ఆయన కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ఆయన్ను తమ కెప్టెన్‌గా నియమించింది. అదే జట్టుకు 2011లో వార్నర్ కెప్టెన్‌గా ఉన్నారు. IPLలోనూ SRHకి కెప్టెన్‌గా కప్ అందించారు.

News November 6, 2024

నాకు కాదు DCMకు చెప్పు: అంబటి

image

AP: హోం మంత్రి అనిత ఎవరో చెప్పాల్సింది తనకు కాదని, DCMకు చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అనిత ఇచ్చుకున్న సెల్ఫ్ సర్టిఫికెట్‌కు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, చాలా సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘H.Mగా బాధ్యత వహించండి. నేను బాధ్యత తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి’ అన్న వ్యక్తికి <<14546885>>ఈ విషయాన్ని<<>> చెప్పాలని సూచించారు.

News November 6, 2024

ఇదీ ట్రంప్ ప్రస్థానం!

image

1959: 13 ఏళ్ల వయసులో న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేరిక
1964-68: పెన్సిల్‌వేనియా వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో BSc
1968: తండ్రికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో కొలువు
1991-2009: ఆరు ఆస్తులు దివాళా తీసినట్లు ప్రకటన
2016: అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నిక
2023: జైల్లో ఫొటో తీయించుకున్న తొలి అధ్యక్షుడిగా మచ్చ
2024: రెండు హత్యాయత్నాలు-తప్పిన ప్రమాదం, 47వ అధ్యక్షుడిగా ఎన్నిక

News November 6, 2024

BGT: రోహిత్ దూరమైతే జైస్వాల్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరంటే?

image

ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో BGT ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ ఫస్ట్ మ్యాచుకు దూరమైతే యశస్వి జైస్వాల్‌తో రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ అదే నిజమైతే వీరిద్దరిలో ఎవరు ఓపెనింగ్‌కి వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి?

News November 6, 2024

KTR ఆరోపణలపై స్పందించిన జలమండలి

image

TG: సుంకిశాల కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని KTR చేసిన ఆరోపణలపై వాటర్ బోర్డు స్పందించింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. సుంకిశాల గోడ కూలడంపై విచారణకు కమిటీ వేశామని తెలిపింది. అటు నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేకపోయిన కాంట్రాక్టు సంస్థకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వివరించింది. విచారణ తర్వాత చర్యలుంటాయంది.

News November 6, 2024

పవన్ కళ్యాణ్ తనయుడికి నటనలో శిక్షణ మొదలు?

image

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

News November 6, 2024

అలా చేస్తే 10-14 ఏళ్లు జైలు శిక్ష: మంత్రి

image

AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.

News November 6, 2024

నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యం: మంత్రి రవీంద్ర

image

AP: మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖ ల్యాబ్‌ల్లో అత్యాధునిక పరీక్షలు చేస్తామని తెలిపారు. బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌కు 13 ప్రామాణిక పరీక్షలు ఉంటాయన్నారు.