News November 6, 2024

ట్రంప్ సంచలన నిర్ణయం

image

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News November 6, 2024

అమిత్ షాతో ముగిసిన పవన్ సమావేశం

image

AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి విగ్రహాన్ని పవన్ బహుకరించారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన ఏపీకి తిరిగి పయనమవుతారు.

News November 6, 2024

భారత్‌లో రూ.2.7 లక్షల కోట్లు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్ ఎవరంటే?

image

భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద FPIగా సింగపూర్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సావరిన్ ఫండ్స్ ద్వారా ఏకంగా రూ.2.69 లక్షల కోట్ల విలువైన షేర్లను హోల్డ్ చేసింది. 2, 3 ప్లేసుల్లోని నార్జెస్ బ్యాంక్ రూ.1.42 లక్షల కోట్లు, US క్యాపిటల్ గ్రూప్ రూ.1.33 లక్షల కోట్ల కన్నా ఇదెంతో ఎక్కువ. HDFC బ్యాంకు, RIL, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్‌టెల్, ఇన్ఫీ, LT, NTPC, M&Mలో ఎక్కువ పెట్టుబడి పెట్టింది.

News November 6, 2024

US ఎన్నికల ఫలితాలు.. ఆ గ్రామంలో నిరాశ

image

US అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ విజయంతో తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు నిరాశకు గురయ్యారు. కమల పూర్వీకులది అదే ఊరు కావడంతో ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలని వాళ్లు పూజలు చేశారు. ఆమె గెలిచాక సంబరాల కోసం బాణసంచా సిద్ధం చేసుకున్నారు. అంచనాలకు భిన్నంగా ట్రంప్ గెలవడంతో వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఓడినా కమలకు మద్దతిస్తామని, ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందంటున్నారు.

News November 6, 2024

బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

image

AP: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆమ్రపాలి ఏపీకి వచ్చి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం విశాఖలో సాగింది. 2010లో ఆమె IASకు సెలెక్ట్ అయ్యారు.

News November 6, 2024

అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు!

image

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రపంచ నలుమూలల క్రేజ్ ఉంటుంది. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది రుజువైంది. ఎన్నికల్లో ఒక ఓటరు తన ఓటును బాలయ్యకు వేశారు. ఏ అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేస్తారనే విభాగంలో ఇష్టమైన వ్యక్తి పేరు రాసి ఓటు వేసే అవకాశం ఉండటంతో సదరు వ్యక్తి ‘బాలయ్య’ అని రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

News November 6, 2024

మిస్టీరియస్.. ఈ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే!

image

భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్‌కుండ్ లేక్ (స్కెలిటెన్ లేక్). ఉత్తరాఖండ్‌‌లోని హిమాలయ శ్రేణుల్లో 16,740 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. దీని అంచున మానవ అస్థిపంజరాలు ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి 800CE-1800 CEకి చెందిన మానవ అవశేషాలుగా గుర్తించారు. ఈ మరణాలకు గల కచ్చితమైన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. తుఫాను లేదా యుద్ధ సమయంలో వీరు చనిపోయి ఉండొచ్చని అంచనా.

News November 6, 2024

తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బీఆర్ నాయుడు

image

AP: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.

News November 6, 2024

యువరాజ్ గర్వపడేలా ఆడేందుకు యత్నిస్తా: అభిషేక్

image

తన మెంటార్ యువరాజ్ సింగ్ గర్వపడేలా దక్షిణాఫ్రికాతో జరిగే T20 సిరీస్‌లో ఆడతానని భారత బ్యాటర్ అభిషేక్ శర్మ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. 2007లో యువీ 6 సిక్సులు కొట్టిన డర్బన్‌ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యువీ ఇన్నింగ్స్‌ను బీసీసీఐ ఇంటర్వ్యూలో అభిషేక్ గుర్తుచేసుకున్నారు. తాను ఇంటి నుంచి ఆ మ్యాచ్ చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు.

News November 6, 2024

BREAKING: రాష్ట్రంలో నిలిచిన మద్యం సరఫరా

image

TG: సర్వర్ ప్రాబ్లమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. కాగా రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.