News January 29, 2025

ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు

image

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంపై ఆర్జీవీకి ఈ నోటీసులు పంపారు. కాగా గతంలోనూ ఆర్జీవీకి పోలీసులు సమన్లు అందించారు. కానీ విచారణకు హాజరు కాలేనంటూ తన న్యాయవాదులతో సమాచారం పంపారు.

News January 29, 2025

వచ్చే నెల 1న తూ.గో జిల్లాకు చంద్రబాబు

image

AP: ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం అదే గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. పింఛన్లు, ఇంటి స్థలాలు, సొంతిళ్ల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

News January 29, 2025

క్షీణిస్తోన్న ‘సూర్య’ ప్రభ

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 14 పరుగులకే వెనుదిరిగి నిరాశ పరిచారు. గత పది టీ20ల్లో 172 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యారు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. తన స్థాయికి తగ్గ ఆట ఆడటం లేదు. ఇలానే ఆడితే రోహిత్ శర్మలానే సూర్య కూడా రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తాయని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.

News January 29, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని సీఎం రేవంత్ నియమించారు. వారం రోజుల్లో సమగ్ర విధివిధానాలతో నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. తక్కువ ధరకే ఇసుక దక్కేలా అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News January 29, 2025

జనవరి 29: చరిత్రలో ఈ రోజు

image

1920: రచయిత, దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు జననం
1936: సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం
1936: సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు జననం
1962: ఉద్యమకారిణి గౌరీ లంకేష్‌ జననం
1977: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ బస్టర్ నుపెన్ మరణం
2003: నటి పండరీబాయి మరణం
2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రామేశ్వర్ ఠాకూర్ నియామకం

News January 29, 2025

ఏపీ కోసం చంద్రబాబు కష్టాలు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలను ఏపీ తీసుకెళ్లే ఆలోచన చంద్రబాబుకు లేదని చెప్పారు. ‘చంద్రబాబు హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఏపీకి గ్లోబల్ క్యాపబులిటీ ఉంది. ఆ రాష్ట్రానికి తీర ప్రాంతం, సహజ వనరులు అపారంగా ఉన్నాయి. ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News January 29, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 29, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 29, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.25 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 29, 2025

నేడు జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం

image

ఇస్రో తన 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం చేపట్టనుంది. దీని ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. 2,250 KGల బరువున్న ఈ శాటిలైట్‌ను 36,000 KM దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ దేశ నావిగేషన్ సిస్టం కోసం పనిచేయనుంది. సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక అనువర్తనాలు, భౌగోళిక నావిగేషన్‌ను మెరుగుపరచనుంది.

News January 29, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.