India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీభూముల <<15298493>>ఆక్రమణల<<>> ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. CM చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్, SP, IFS అధికారి యశోదాను కమిటీలో సభ్యులుగా నియమించారు. జాయింట్ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అటు, పెద్దిరెడ్డి భూఆక్రమణలపై విచారణకు Dy.CM పవన్ ఆదేశించిన విషయం తెలిసిందే.

పని మనుషులు తప్పనిసరి శ్రామికవర్గమని సుప్రీంకోర్టు తెలిపింది. వారి హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా చట్టాలేమీ లేవంది. కొందరు యజమానులు, ఏజెన్సీలు వారిని దూషిస్తూ, దోపిడీ చేయడంతో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని పేర్కొంది. వారి రక్షణకు చట్టం చేసేలా సలహాల స్వీకరణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 6 నెలల్లోగా వారు రిపోర్టు ఇవ్వాలని, దాని ఆధారంగా చట్టం చేయాలని సూచించింది.

గాజాకు కండోమ్స్ సరఫరా కోసం బైడెన్ యంత్రాంగం కేటాయించిన 50 మిలియన్ డాలర్లను ట్రంప్ నిలిపేశారని US అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం సమర్థంగా పనిచేసేందుకు ఉద్దేశించిన డోజ్ మంత్రిత్వ శాఖ ఆ నిధుల విషయాన్ని గుర్తించినట్లు శ్వేతసౌధ కార్యదర్శి కరోలిన్ పేర్కొన్నారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులు కండోమ్‌లను బుడగల్లా చేసి వాటిలో ప్రమాదకర వాయువుల్ని నింపి ఇజ్రాయెల్‌వైపు వదులుతున్నారన్న ఆరోపణలున్నాయి.

తనపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ <<15297213>>కేసు<<>> గెలిచిందన్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ‘సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేస్తుంది. యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చాక నిజం అందరికీ తెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగారు. తొలి ఓవర్‌లోనే 3 ఫోర్లు బాది లంక బౌలర్లకు హెచ్చరికలు పంపారు. ఎడాపెడా బౌండరీలు బాది 40 బంతుల్లోనే 57(10 ఫోర్లు, ఒక సిక్స్) రన్స్ చేసి ఔట్ అయ్యారు. దీంతో వన్డే, టీ20, టెస్ట్.. ఇలా ఫార్మాట్ ఏదైనా హెడ్ తగ్గడని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అటు ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 145 రన్స్.

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై Dy.CM పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవులను ధ్వంసం చేసి భూములు ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ సూచించారు.

TG: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వచ్చే నెల 7న ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్‌లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కంటే కాంగ్రెస్ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు.

KTR <<15289834>>విమర్శలపై<<>> మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహించారు. KTR, హరీశ్ తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. KCR అల్లుడిగా, కొడుకుగా వాళ్లిద్దరూ నాయకులు అయ్యారని వ్యాఖ్యానించారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. తెలంగాణ కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాటం చేశారని అన్నారు. బండి సంజయ్ కంటే ముందు నుంచే గద్దర్ ఉద్యమంలో ఉన్నారని పేర్కొన్నారు.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకొనేందుకు స్థానిక పాలకబృందం పనిచేస్తోందని తెలిపారు. యూపీ సీఎం యోగితో నిరంతరం మాట్లాడుతున్నానని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను తీసుకురావడంలో బైడెన్ విఫలమయ్యారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ‘2024 జూన్‌లో వెళ్లిన వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురాలేకపోయారు. వెంటనే వారిని సురక్షితంగా తీసుకురావాలని స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌ను ఆదేశిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. మస్క్ దీనికి సానుకూలంగా స్పందించారు.
Sorry, no posts matched your criteria.