India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన 15 రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైనట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. సంక్రాంతికి విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా ఇప్పటికే చరిత్ర సృష్టించింది.

AP: తాము 2001లో కొనుగోలు చేసిన భూములకు రెవెన్యూ శాఖ సర్వే చేసిందని, వాటిని ఇప్పుడు అటవీ భూములు అంటున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. అలాగే, ఎంతమంది YCP నుంచి వెళ్లినా పార్టీకి ఏం కాదన్నారు. VSR రాజీనామా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. పెద్దిరెడ్డి భూములపై ఆరోపణలు రాగా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఏపీలో త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెల 6న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్ పరీక్షలకు సెంటర్లు ఇవ్వొద్దని నిర్ణయించాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించాయి. ఫీజుల చెల్లింపులో కాలేజీలకు ఫైన్ వేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రాక్టికల్స్‌కు సీసీ కెమెరాల నిబంధన సరికాదన్నాయి. కార్పొరెట్ కాలేజీలకు బోర్డు అధికారులు ఏజెంట్లుగా మారారని విమర్శించాయి.

AP: మంగళగిరిలోని ఆటోనగర్‌లో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటుకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ చర్యలు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. 10.80 ఎకరాల్లో పార్కు ఏర్పాటుకు ఇవాళ స్థలాన్ని పరిశీలించిన ఆమె మాట్లాడారు. TNలోని కంచి తరహాలో పార్కును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 365 రోజులూ చేనేత కార్మికులకు పని కల్పిస్తామని చెప్పారు. YCP పాలనలో సాయం అందక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

TG: వేసవి ముగిసే వరకు నీటి ఎద్దడి లేకుండా ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీరు అందించేలా మిషన్ భగీరథ సిబ్బంది కృషి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ పథకానికి వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలెందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. Feb 1-10 తేదీల మధ్య సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

దక్షిణ సూడాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యునిటీ స్టేట్ నుంచి జుబా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలింది. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు, సిబ్బంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

మార్కెట్‌లో ఎన్నో రకాల కార్ల కంపెనీలు ఉండగా కొందరు మైలేజ్ చూస్తే.. మరికొందరు సేఫ్టీ చూస్తుంటారు. టాప్‌లో ఉన్న కార్ల కంపెనీలు ఏయే సంవత్సరాల్లో మొదలు పెట్టారో చాలా మందికి తెలియదు. ఇండియన్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌ను 1945లో స్థాపించారు. 2003లో టెస్లా, హ్యుందాయ్ 1967, హోండా 1948, కియా 1944 , టయోటా 1935, నిస్సాన్ 1933, మెర్సిడెస్ బెంజ్ 1926, బెంట్లీ 1919, BMWని 1916లో ప్రారంభించారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి యాక్టర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. తమిళ నటుడు అథర్వ హీరోగా నటించే సినిమాలో తమన్ లీడ్ యాక్టర్‌గా చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ దశలో ఉందని వెల్లడించాయి. దీంతో చాలా కాలం తర్వాత తమన్ సినిమాలో నటుడిగా కనిపించే అవకాశం ఉంది. కాగా, 2003లో రిలీజైన బాయ్స్ మూవీలో తమన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేక, గొర్రెల మండీలు, దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా నిఘా ఉంచాలని సూచించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Sorry, no posts matched your criteria.