News January 30, 2025

మార్చి 31లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

image

TG: ‘రైతు భరోసా’ సాయాన్ని మార్చి 31లోగా రైతులందరి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం రూ.54,280 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.72వేల కోట్ల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News January 30, 2025

కొత్త సీఎస్ ఎవరో?

image

తెలంగాణ ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ(సీఎస్) శాంతి కుమారి పదవీకాలం ఏప్రిల్ 7న ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్‌లు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది చూడాలి.

News January 30, 2025

రాకెట్ ప్రయోగం.. శ్రీహరికోట నుంచే ఎందుకంటే?

image

AP: శ్రీహరికోట నుంచి ఇస్రో రాకెట్ ప్రయోగాలు చేపడుతోంది. కానీ దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నా ఇక్కడి నుంచే ఈ ప్రయోగాలు చేసేందుకు చాలా కారణాలు ఉన్నాయి. శ్రీహరికోట భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటంతో తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే గంటకు 1,440 కి.మీ అదనపు వేగం వస్తుంది. చుట్టూ సముద్రం ఉండటం వల్ల రాకెట్ కూలినా ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏడాది పొడవునా ఎక్కువ వర్షాలు, ఎండలు ఉండవు. దృఢమైన భూమి ఉండటం కూడా కలిసొచ్చే అంశం.

News January 30, 2025

రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

image

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/

News January 30, 2025

టీనేజ్ అమ్మాయిలు వీటిని తింటున్నారా?

image

టీనేజ్‌లో అమ్మాయిల శరీరాల్లో మార్పులు వస్తాయి కాబట్టి వారు పోషకాహారం తీసుకోవాలి. కాల్షియం, ఐరన్, అయోడిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. వారు భవిష్యత్‌లో గర్భం దాల్చినప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మాంసకృత్తులు ఉన్న ఆహారం తీసుకోవాలి. మటన్, చికెన్, చేపలు, గుడ్లు, పాలు, వెన్న తినాలి. అలాగే ఓక్రా, బ్రొకోలి, క్యాబేజీ, పాలకూర వంటివి రొటీన్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

News January 30, 2025

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్

image

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి ‘పుష్ప-2’ మూవీ మాత్రమే ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తుందని నిన్న ప్రకటించారు. రీలోడెడ్ త్వరలో రిలీజ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. కానీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ 23 నిమిషాలు కలిపిన రీలోడెడ్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళంలో ప్రసారమవుతోంది.

News January 30, 2025

అమల్లోకి ఎన్నికల కోడ్.. పథకాలు ఆగిపోతాయా?

image

TG: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీముల ప్రారంభానికి బ్రేక్ పడింది. పాత పథకాలు యథావిధిగా అమలు కానున్నాయి. ఈనెల 26న ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27న రాష్ట్రంలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు <<15299294>>ఎన్నికలు<<>> జరగనున్నాయి.

News January 30, 2025

ఫిర్యాదులకు ఆలయాల్లో QR కోడ్

image

AP: రాష్ట్రంలోని ఆలయాల్లో తమకు ఎదురైన ఇబ్బందులపై ఫిర్యాదు చేయడంతోపాటు సలహాలు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్‌ను దేవదాయ శాఖ అందుబాటులోకి తేనుంది. తొలుత సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దర్శన అనుభవం, ఇతర మౌలిక సదుపాయాలు, సిబ్బంది ప్రవర్తనపై భక్తులు ఫిర్యాదు చేయొచ్చు.

News January 30, 2025

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై ప్రభుత్వం క్లారిటీ

image

AP: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను <<15097641>>రద్దు చేస్తారనే<<>> వార్తలపై ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆ ఎగ్జామ్స్ యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్నల్ మార్క్స్ ఆలోచనను విరమించుకుంది. వివిధ వర్గాల నుంచి స్వీకరించిన సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. NCERT సిలబస్ అమలు చేయనుంది. మ్యాథ్స్‌లో A, B పేపర్లు కాకుండా ఒకే పేపర్‌గా ఇస్తారు. బోటనీ, బయాలజీ కలిపి ఒకే పేపర్ ఉంటుంది.

News January 30, 2025

వచ్చే వారంలో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ?

image

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఫిబ్రవరి మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశముంది. కులగణన, బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు వచ్చే నెల తొలి వారంలో మంత్రివర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాలపై చర్చ పెట్టి తీర్మానం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.