News November 7, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కిషన్ రెడ్డి

image

TG: 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని విమర్శించారు. HYDలో సంస్థాగత ఎన్నికల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికల వ్యవస్థ బీజేపీకి ఊపిరి అని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

News November 7, 2024

డా.యల్లాప్రగడ సుబ్బారావు గురించి తెలుసా?

image

డా.యల్లాప్రగడ <<14550601>>సుబ్బారావు<<>> భీమవరంలో 1895లో జన్మించారు. రాజమండ్రిలో మెట్రిక్యులేషన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి PhD పొందారు. కణాల్లో ATP పనితీరును కనుగొన్నారు. క్యాన్సర్ చికిత్సకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేశారు. హెట్రోజెన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీ బయోటిక్స్‌ను ప్రపంచానికి అందించారు. వండర్ డ్రగ్స్ మాంత్రికుడిగా పేరొందిన ఆయన 1948లో కన్నుమూశారు.

News November 7, 2024

నా శరీరం సహకరించడం లేదు: సాహా

image

క్రికెట్ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తెలిపారు. అందుకే రిటైర్మెంట్ పలికానని ఆయన చెప్పారు. ‘నాకెంతో ఇష్టమైన క్రికెట్‌ను ఆస్వాదించలేకపోతున్నా. అందుకే గతేడాదే వీడ్కోలు పలుకుదామనుకున్నా. కానీ సౌరవ్ గంగూలీ, నా భార్య నన్ను మార్చారు. ఈ సీజన్‌లో రంజీల్లో ఆడాలని సూచించారు. ఈడెన్ గార్డెన్స్‌లో నా చివరి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని ఆయన పేర్కొన్నారు.

News November 7, 2024

కరెంట్ ఛార్జీలు పెంచను: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలపై విద్యుత్ భారానికి గత ప్రభుత్వమే కారణమని, ఆ రంగంపై రూ.1.25 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ‘1998లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చా. తలసరి కరెంట్ వినియోగం పెంచా. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించా. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 7, 2024

వాయు కాలుష్యం కట్టడికి భారీ జరిమానాలు

image

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించేలా ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్-2023’ చట్టంలో సవరణలు చేసింది. 2 ఎకరాలలోపు రూ.5,000, 2-5 ఎకరాల మధ్య రూ.10,000, 5 ఎకరాల పైన రూ.30,000 ఫైన్ వేయనుంది.

News November 7, 2024

రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు

image

బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను కొనసాగించాలని ఆదేశించింది. 2022లో ఓ టీచర్‌పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత వారిమధ్య రాజీ కుదరడంతో FIRను హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును ఓ వ్యక్తి సుప్రీంలో సవాల్ చేశారు.

News November 7, 2024

చంద్రబాబు వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు: లోకేశ్

image

AP: వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతి విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్యపై సదస్సులో ఆయన మాట్లాడారు. తాను కూడా హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. మనకు, విదేశాల్లో విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు వచ్చాయని, మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు.

News November 7, 2024

వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు

image

AP: వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్‌ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు. ‘వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య’ అని ఆయన మాట్లాడారు.

News November 7, 2024

STOCK MARKETS: రూ.3.5లక్షల కోట్ల నష్టం

image

స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. US FED వడ్డీరేట్ల కోతపై నిర్ణయం, US బాండ్ యీల్డుల పెరుగుదల, డాలర్ బలపడటం, FIIల పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,638 (-739), నిఫ్టీ 24,218 (-265) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. హిందాల్కో 8%, ట్రెంట్, గ్రాసిమ్ 3%, Adanient, TechM 2.5% మేర నష్టపోయాయి.

News November 7, 2024

ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’

image

సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీల కోసం నిన్న ముంబైలో ప్రివ్యూ షో వేయగా షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, కృతిశెట్టి, సందీప్ కిషన్ తదితరులు వీక్షించారు. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ అంటూ కితాబిచ్చారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు నటించారు.