India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీల కోసం నిన్న ముంబైలో ప్రివ్యూ షో వేయగా షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, కృతిశెట్టి, సందీప్ కిషన్ తదితరులు వీక్షించారు. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ అంటూ కితాబిచ్చారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు నటించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో ఐదుగురు బిలియనీర్లు దాదాపు 53 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. ముఖ్యంగా ట్రంప్‌కు మద్దతుగా ప్రచారానికి $119 మిలియన్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $26.5 బిలియన్లు (రూ.2.2లక్షల కోట్లు) లాభపడ్డారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర విలువ $26.5B పెరిగి $290 బిలియన్లకు చేరింది.
డొనాల్డ్ ట్రంప్ కొందరు డెమోక్రాట్లపై ప్రతీకారం తీర్చుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని, తాను ఓడిపోలేదని, ఓటమిని అంగీకరించి వైట్‌హౌస్‌ను వీడాల్సింది కాదని ఆయన చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు. చివరి 5 ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఎప్పుడూ పడనన్ని ఓట్లు (8CR) బైడెన్‌కు రావడం గమనార్హం.
రైతుల బాధలపై పార్లమెంట్‌లో బలమైన గొంతుక వినిపించిన గొప్ప నేత గోగినేని రంగారావు(NG రంగా). గుంటూరు(D) నిడుబ్రోలులో 1900 NOV 7న జన్మించారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేశారు. జమిందారీ విధానానికి ఎదురొడ్డి నిలిచారు. నీతివంతంగా, నిరాడంబరంగా జీవించిన ఆయన పదవులకు ఏనాడూ ఆశ పడలేదు. 1952లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ స్థాపించారు. 1997లో వ్యవసాయ కాలేజీకి NG రంగా పేరు పెట్టారు.
రైతుల కోసం ఎన్జీ రంగా చేసిన పోరాటం అనిర్వచనీయం. రష్యా ముద్రగల సమష్టి సహకార విధానాన్ని నాటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా దానిని వ్యతిరేకిస్తూ ఎన్జీ ఉత్తేజిత ప్రసంగం చేశారు. ఆ బిల్లు వీగిపోయేలా చేశారు. అనంతరం ‘రంగాజీ పార్లమెంట్‌లో ఉన్నంత కాలం రైతాంగం హాయిగా నిద్రపోవచ్చు’ అని నెహ్రూనే ప్రశంసించడం కొసమెరుపు. 1930-1991 వరకు ఎంపీగా సేవలు అందించిన ఎన్జీ రంగా గిన్నిస్ రికార్డు సాధించారు.
టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులపై పేర్లలో అక్షరం తేడా ఉన్నా JEE మెయిన్‌కు దరఖాస్తు చేసుకోలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌లో ఇంటిపేరు సంక్షిప్తంగా ఉన్నా ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌లో NTA మార్పులు చేసింది. పేర్లు మిస్‌మ్యాచ్ అయినట్లు చూపే పాప్ అప్ బాక్స్‌ను మూసేస్తే కొత్త విండో ఓపెనవుతుందని తెలిపింది. అందులో ఆధార్‌పై ఉన్న వివరాలు నమోదు చేయాలని పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ విజయంతో బిట్‌కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇన్వెస్టర్లు USBTC ETFల్లో పెట్టుబడులు పెట్టడంతో 10% పెరిగి తొలిసారి $76000కు చేరుకుంది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.64 లక్షలతో సమానం. ఈ ఏడాది ఆరంభంలో రూ.30లక్షల వద్ద ఉన్న BTC నవంబర్ నాటికి 100% రిటర్న్ ఇవ్వడం విశేషం. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, రాబర్ట్ కియోసాకి సహా చాలామంది రిపబ్లికన్లు క్రిప్టో కరెన్సీకి గట్టి మద్దతుదారులు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. గోస్ట్స్ కాంట్ డూ ఇట్ (1989), హోమ్ అలోన్ 2 (1992), ది లిటిల్ రాస్కల్స్ (1994), ఎక్రాస్ ది సీ ఆఫ్ టైమ్ ఆమే అడ్వెంచర్ (1995), ది అసోసియేట్ (1996), 54, సెలబ్రిటీ (1998), జూలాండర్ (2001), టూ వీక్స్ నోటీస్ (2002), వాల్ స్ట్రీట్ (2010) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. పలు టీవీ షోల్లో కూడా ఆయన మెరిశారు.
మహిళలకు చీరకట్టు అందం. అదే చీరను సుదీర్ఘకాలం బిగుతుగా కట్టుకుంటే స్కిన్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర, బిహార్ వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఇద్దరు 60, 70ఏళ్ల మహిళల్లో ఈ పరిస్థితి గుర్తించినట్లు తెలిపారు. చీరలోపల పెట్టీకోట్‌ను టైట్‌గా కట్టుకోవడంతో కడుపుపై ఒత్తిడి కలిగి అల్సర్ ఏర్పడుతుందని, ఇది క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీన్ని శారీ క్యాన్సర్‌గా పిలుస్తున్నారు.
AP: తాను పార్టీ మారుతున్నట్లు గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై జోగి రమేశ్ స్పష్టత ఇచ్చారు. ‘నేను వైసీపీలోనే ఉంటా. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే ప్రయాణం కొనసాగిస్తా. 2019లో జగన్ కోసం సీటు త్యాగం చేసి పక్కకు వెళ్లా. నేను YSR శిష్యుడిని. నా కుమారుడిపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఎవరెన్ని కేసులు పెట్టినా బెదిరే వ్యక్తిని కాదు’ అని ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.