India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: వేసవి ముగిసే వరకు నీటి ఎద్దడి లేకుండా ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీరు అందించేలా మిషన్ భగీరథ సిబ్బంది కృషి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ పథకానికి వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలెందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. Feb 1-10 తేదీల మధ్య సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

దక్షిణ సూడాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యునిటీ స్టేట్ నుంచి జుబా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలింది. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు, సిబ్బంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

మార్కెట్‌లో ఎన్నో రకాల కార్ల కంపెనీలు ఉండగా కొందరు మైలేజ్ చూస్తే.. మరికొందరు సేఫ్టీ చూస్తుంటారు. టాప్‌లో ఉన్న కార్ల కంపెనీలు ఏయే సంవత్సరాల్లో మొదలు పెట్టారో చాలా మందికి తెలియదు. ఇండియన్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌ను 1945లో స్థాపించారు. 2003లో టెస్లా, హ్యుందాయ్ 1967, హోండా 1948, కియా 1944 , టయోటా 1935, నిస్సాన్ 1933, మెర్సిడెస్ బెంజ్ 1926, బెంట్లీ 1919, BMWని 1916లో ప్రారంభించారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి యాక్టర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. తమిళ నటుడు అథర్వ హీరోగా నటించే సినిమాలో తమన్ లీడ్ యాక్టర్‌గా చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ దశలో ఉందని వెల్లడించాయి. దీంతో చాలా కాలం తర్వాత తమన్ సినిమాలో నటుడిగా కనిపించే అవకాశం ఉంది. కాగా, 2003లో రిలీజైన బాయ్స్ మూవీలో తమన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేక, గొర్రెల మండీలు, దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా నిఘా ఉంచాలని సూచించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

చైనాలోని ఓ వైల్డ్ లైఫ్ జూ నిర్వాహకులు పులి మూత్రాన్ని విక్రయిస్తున్నారు. 250mlకి 50 యువాన్లు (₹600) తీసుకుంటున్నారు. టైగర్ మూత్రంలో అద్భుత ఔషధాలు ఉన్నాయని, దీనితో కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ నయం అవుతాయని చెబుతున్నారు. పులి మూత్రాన్ని వైట్ వైన్, అల్లం ముక్కలతో మిక్స్ చేయాలని సూచిస్తున్నారు. అయితే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదని, మూత్రాన్ని అమ్మడానికి లైసెన్స్ లేదని పలువురు సందర్శకులు అంటున్నారు.

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటికి 420 రోజులవుతుందని, కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదని BRS ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి. అలాగే, రేపు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అయినా ప్రభుత్వం కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి జరిగి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్కడ పర్యటించాలని ఆ నగరాల మేయర్లు US అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ‘అణుశక్తిపై ఆధారపడటాన్ని తగ్గించి అణ్వాయుధ నిషేధానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. తద్వారా ప్రపంచశాంతిని నెలకొల్పుతారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌పై US అణుబాంబులు జారవిడవగా 2.10 లక్షలమందికిపైగా కన్నుమూశారు.

కోపం, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలను ఏదో ఒక సందర్భంలో చూపిస్తాం. అయితే, ప్రతికూల భావోద్వేగాలను అతిగా చూపిస్తే అనారోగ్యపడతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతికోపం వల్ల కాలేయం బలహీనమవుతుంది. దుఃఖం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. శ్వాసకోస సమస్యలొస్తాయి. చింత వల్ల జీర్ణక్రియ సమస్యలు, భయం వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరిగితే గుండె & మెదడు పనితీరు మందగిస్తుంది.

దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది. త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు పొందుతారని సీఎం చంద్రబాబు చెప్పారు.
Sorry, no posts matched your criteria.