News November 5, 2024

షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు

image

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కౌంటీల్లో సర్రే తరఫున ఆడుతున్న షకీబ్ బౌలింగ్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. కాగా దాదాపు 13 ఏళ్ల తర్వాత షకీబ్ కౌంటీల్లో రీఎంట్రీ ఇచ్చారు. సోమర్‌సెట్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆయన 9 వికెట్లు తీశారు.

News November 5, 2024

ప్రైవేటు ఆస్తి ప్రజావనరు కాదు: సుప్రీంకోర్టు

image

ప్రతి ప్రైవేటు ఆస్తి ప్రజా వనరుల కిందకు రాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రైవేటు ఆస్తులు ప్రజా వనరుల కిందకే వస్తాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు మేలు చేయొచ్చని 1978లో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు చెల్లదని వివరించింది. 1960 నాటి సోషలిస్ట్ ఎకానమీ 1990ల్లో మార్కెట్ ఆధారిత ఎకానమీగా మారిందని పేర్కొంది. పాత ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదని తీర్పునిచ్చింది.

News November 5, 2024

పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ విడుదల

image

సరిగ్గా మరో నెల రోజుల్లో ‘పుష్ప-2’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ ఎదురుపడిన పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ‘బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ రాబోతోంది. సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

News November 5, 2024

YCPకి మరో షాక్.. టీడీపీలోకి కుప్పం మున్సిపల్ ఛైర్మన్

image

AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అంతకుముందు ఆయన వైసీపీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. కాగా గత ఎన్నికల్లో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకు గానూ వైసీపీ 19, టీడీపీ 6 చోట్ల గెలిచాయి.

News November 5, 2024

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ

image

AP: ఐదేళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని DGP ద్వారకా తిరుమలరావు తెలిపారు. ‘గతంలో ఓ పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరినీ అరెస్టు చేయలేదు. తప్పు జరిగితే 30ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చు’ అని చెప్పారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు.

News November 5, 2024

మిడ్ డే మీల్: ఒక్కో ప్రాంతానికి ఒక్కో మెనూ!

image

AP: మధ్యాహ్న భోజన పథక స్వరూపాన్ని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే మెనూ ఉండగా, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా 4 రకాల మెనూ అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు ఇష్టపడే, పౌష్టికాహారం ఉండేలా <<14428656>>మెనూలను<<>> అధికారులు తయారుచేశారు. మరింత కసరత్తు అనంతరం కొత్త మెనూను డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.

News November 5, 2024

రైతులకు గాడిద గుడ్డు అందింది: TG BJP

image

తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్న కాంగ్రెస్ ట్వీట్‌కు TGBJP కౌంటర్ ఇచ్చింది. ‘OCT 6న PM మోదీకి సీఎం రేవంత్ రాసిన లేఖలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఇప్పుడు ఈ సంఖ్య 40 లక్షలకు చేరింది. వాస్తవమేంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. రూ.15వేలు రైతు భరోసాగా ఇస్తామని చెప్పి గాడిద గుడ్డు అందించింది’ అని పేర్కొంది.

News November 5, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

image

డిజిటల్ క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో మెసేజ్ రిక్వెస్ట్‌లను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. ప్రతీ మెసేజ్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరిఫైడ్, బిజినెస్, సబ్‌స్క్రైబర్స్/ఇతర కేటగిరీల్లో అవసరమైన దానిని సెలక్ట్ చేసుకుంటే ఆయా ప్రొఫైల్స్‌కు సంబంధించిన మెసేజ్‌లను సెపరేట్‌గా చూపిస్తుంది. అలాగే స్టోరీ రిప్లైస్‌కూ సెపరేట్ ఫోల్డర్‌ను ఇన్‌స్టా యాడ్ చేసింది.

News November 5, 2024

హీరో కోసం 95 రోజులుగా ఎదురుచూపులు.. చివరికి!

image

తమ అభిమాన హీరోను కలవాలని, ఆయనతో ఓ ఫొటో దిగాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే, అది కొందరికే సాధ్యమవుతుంది. తాజాగా ఓ వీరాభిమాని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను కలిసేందుకు సాహసమే చేశారు. ఝార్ఖండ్‌కు చెందిన ఓ అభిమాని ఖాన్‌ను కలిసేందుకు ఆయన ఇంటి బయట 95 రోజులుగా ఎదురుచూశాడు. ఈ విషయాన్ని సెక్యురిటీ ఆయనకు చెప్పడంతో అభిమానిని లోపలికి పిలిచి అతనితో ఫొటో దిగారు.

News November 5, 2024

2025 సమ్మర్‌ బరిలో రజినీకాంత్ ‘కూలీ’

image

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2025 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డైరెక్టర్ ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శివ కార్తికేయన్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.