India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

PG మెడికల్ సీట్లలో 50% లోకల్ రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2025కి తెలంగాణలో 2924 PG సీట్లు ఉండగా, 50% లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1462 సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకే దక్కేవన్నారు. అయితే తాజా తీర్పుతో ఈ సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయన్నారు.

డ్రాగన్ కంపెనీలు తమ అడ్వాన్సుడు AI మోడళ్లను కాపీ కొడుతున్నాయని ChatGPT మేకర్ OpenAI ఆందోళన పడుతోంది. ‘US లీడింగ్ AI మోడళ్లను చైనా కంపెనీలు కాపీ కొట్టడం మనకు తెలిసిందే. అవలా చేయకుండా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటాం. పోటీదారులు, ఇబ్బందుల నుంచి అమెరికా టెక్నాలజీని కాపాడుకుంటాం’ అని పేర్కొంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కాపీరైట్ ఉల్లంఘన కేసులున్న ChatGPT ఇలా చెప్తుండటం హాస్యాస్పదం.

AP: YCP కార్పొరేటర్లను TDP MLAలు కొంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి పశువుల్లా కొనుగోలు చేసి కేంద్రమంత్రి పెమ్మసాని కండువాలు కప్పుతున్నారు. ఆయన కొంచెం తగ్గించుకుంటే మంచిది. కార్పొరేటర్ల చుట్టూ MLAలు తిరుగుతున్నారు’ అని ఆరోపించారు. FEB 3న వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, Dy.మేయర్ల ఎన్నికలు జరగనున్నాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం కన్నడలో రిలీజైన ‘భీమసేన నలమహారాజా’ను రీమేక్ చేశారని నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య ఆరోపించారు. తనను సంప్రదించకుండానే, రీమేక్ హక్కులను కొనకుండానే ఎలా రూపొందిస్తారంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘నాని ఇలాంటి చెత్త పని చేస్తారని అనుకోలేదు’ అని పోస్ట్ చేశారు.

TG: దావోస్ పర్యటనపై రాజకీయ విమర్శలు సహజమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రిలయన్స్ కంపెనీ ముంబైలోనే ఉన్నా MH ప్రభుత్వం కూడా దావోస్‌కు వచ్చి వారితో ఒప్పందం చేసుకుందన్నారు. కరీంనగర్ లాంటి చిన్న నగరాల్లోనూ ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని వివరించారు. పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరగాలనే దావోస్ వెళ్లామని మంత్రి చెప్పారు. అటు ఒకట్రెండు రోజుల్లో తమ పార్టీ MLC అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. Sensex 226 పాయింట్లు ఎగసి 76,759 వద్ద, Nifty 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద స్థిరపడింది. ఫార్మా, రియల్టీ, ఆయిల్&గ్యాస్, బ్యాంకు, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలు రాణించాయి. BEL, Power Grid, Hero MotoCorp టాప్ గెయినర్స్.

TG: రాష్ట్రంలో పాలన ఎలా ఉందంటూ ట్విటర్‌లో నిర్వహించిన <<15307146>>పోల్‌కు<<>> నకిలీ అకౌంట్లతో దాడి చేశారని తెలంగాణ కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఈ పనికి కోట్లు ఖర్చుపెట్టడం అవసరమా అని ప్రశ్నించింది. పోల్‌లో ఫామ్ హౌస్ పాలనేంటని ప్రశ్నించే ఒక్క కామెంటూ రాలేదని పేర్కొంది. దీన్ని బట్టే ఇది గులాబోళ్ల పని అని అర్థం చేసుకోవచ్చంది. ఫౌం హౌస్ పాలన ప్రజాస్వామ్యం కానే కాదని విమర్శించింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభాస్‌కు తన స్టార్‌డమ్ గురించి తెలియదు. నాకు తెలిసినంత వరకూ ఆయన సోషల్‌మీడియా కూడా ఉపయోగించరు. ప్రైవేట్ పర్సన్. అత్యంత సన్నిహితులతోనే అన్ని విషయాలు పంచుకుంటారు. సలార్ వల్ల ప్రభాస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, త్వరలోనే ‘సలార్-2’ షూటింగ్ మొదలవనుంది.

కుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందిన వారి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. కుంభమేళాకు వచ్చిన అనేక మంది ఆచూకీ దొరక్క బంధుమిత్రులు ఆందోళన పడుతున్నారని, తొక్కిసలాట సందర్భంగా వారికేమైనా జరిగిందేమో అని భయపడుతున్నట్లు చెప్పారు. మృతుల వివరాలను వెల్లడించడం వల్ల అందుబాటులోకిరాని ఆప్తుల ఆచూకీపై కుటుంబసభ్యులకు అనవసర భయాలు తొలగుతాయని పేర్కొన్నారు.

AP: రాష్ట్రంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ.44,776cr పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో ఏర్పాటు చేయనున్న 2,300MW విద్యుత్ ప్రాజెక్టుకు SIPB ఆమోదం లభించింది. దీంతో పాటు ఇతర ప్రాజెక్టులు CM చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశంలో ఆమోదం పొందాయి.
Sorry, no posts matched your criteria.