India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేవదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, CMRF, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలకు గాను గత అక్టోబర్‌లో ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది.

క్రెడిట్ కార్డు డ్యూ కట్టకపోవడంతో బ్యాంకుకు తన ఫ్రెండ్ ఏకంగా రూ.22 లక్షలు బాకీ పడినట్లు ఓ వ్యక్తి ‘రెడిట్’లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నా ఫ్రెండ్‌కు బ్యాంకు నుంచి రూ.22 లక్షలు బాకీ ఉన్నట్లు నోటీసు వచ్చింది. 2007లో తన క్రెడిట్ కార్డు ద్వారా రూ.299 లావాదేవీ చేసి దానిని మర్చిపోయాడు. అప్పటి నుంచి వడ్డీలు వేయడంతో ఇప్పుడది రూ.22లక్షలకు చేరింది. ఇది క్రెడిట్ రిపోర్ట్స్‌లో చూశాం’ అని పేర్కొన్నారు.

యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెద్దపేగు/కొలోన్ క్యాన్సర్ ఒకటి. కొలొనోస్కోపీ ఇబ్బందికరంగా ఉండటంతో చాలామంది స్క్రీనింగ్ చేయించుకోవడం లేదు. ఈ సమస్యను యేల్ యూనివర్సిటీ పరిష్కరించింది. ఈ వ్యాధిని గుర్తించే రక్తపరీక్షను కనిపెట్టింది. రోగస్థుల్లో 81%, ఆరోగ్యవంతుల్లో (లేదని) 90% కచ్చితత్వంతో రిజల్టు వచ్చినట్టు తెలిపింది. వీరికి కొలనోస్కోపీ, రక్తపరీక్షలను ఒకేసారి నిర్వహించి ఫలితాలను సమీక్షించారు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ చేశారు. 290 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ద్విశతకం బాదారు. ఈ ఆసీస్ బ్యాటర్‌కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కాగా శ్రీలంకలో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 38 ఏళ్ల ఖవాజా ఇప్పటివరకు 79 టెస్ట్ మ్యాచుల్లో 5వేలకు పైగా రన్స్ చేశారు. ఇందులో 15 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి.

అమెరికాలో జరిగిన ఘోర విమాన <<15307610>>ప్రమాదంపై<<>> ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మానవ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని, కంట్రోల్ టవర్ సిబ్బంది వైఫల్యం వల్లే ఇలా జరిగిందని అన్నారు. హెలికాప్టర్ సిబ్బందిని అలర్ట్ చేసి ఉంటే ప్రమాదం తప్పేదని చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

ట్రాన్సాక్షన్ IDలో స్పెషల్ క్యారెక్టర్లు(@, #, &) లేకుండా ఆల్ఫాన్యూమరిక్(ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు)తోనే IDలు జనరేట్ చేయాలని UPI ఆపరేటర్స్‌ను NPCI ఆదేశించింది. లేదంటే FEB 1 నుంచి ఆయా లావాదేవీలు సక్సెస్ కావని వెల్లడించింది. కాగా ఈ ఆదేశాలను పాటించని యాప్స్ ద్వారా యూజర్స్ ట్రాన్సాక్షన్ చేయలేరు. ఫేక్ IDలను నివారించడానికి, లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI తెలిపింది.

TG: సూర్యాపేటలో బంటి పరువు <<15286143>>హత్య<<>> కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు బంటి భార్య భార్గవి సోదరుడు నవీనే మర్డర్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇందుకు అతడి నానమ్మ కూడా పరోక్షంగా కారణమైందని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. పరువు తీసిందంటూ హత్యకు నవీన్‌ను ఆమె రెచ్చగొట్టిందని పోలీసులు తెలిపారు. వారిని కఠినంగా శిక్షించాలని భార్గవి డిమాండ్ చేసింది.

విక్టరీ వెంకటేశ్ సహా పలువురు స్టార్లు తన నెక్స్ట్ సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తాను ‘సిండికేట్’ అనే టైటిల్‌తో సినిమా తీయబోతున్న మాట మాత్రం నిజమేనని అన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాల్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. కామారెడ్డికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు.

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందన్న ఆరోపణపై సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ఆయన <<15305182>>వివరణను<<>> తోసిపుచ్చింది. ఆధారాలు, వాస్తవాలు కాకుండా సాధారణ వివరణ ఇచ్చారని వెల్లడించింది. స్పష్టత ఇవ్వకుండా జస్టిఫై చేస్తున్నారని పేర్కొంది. శుక్రవారం 11AM లోపు మళ్లీ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వేర్వేరు అంశాలను కలపొద్దని సూచించింది.
Sorry, no posts matched your criteria.