News January 30, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్ పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఇదే కేసులో తిరుపతన్నకు కూడా కోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News January 30, 2025

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో సిరాజ్ డేటింగ్?

image

టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇటీవల ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె తనకు సోదరిలాంటిదని సిరాజ్ చెప్పడంతో ఆ వదంతులకు తెరపడింది.

News January 30, 2025

హీరోల గొడవ.. ఈ పార్ట్ సరిగా ప్లాన్ చేసుకోలేదా!

image

హీరోలు శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీల మధ్య టైటిల్స్ వివాదం నెలకొంది. విజయ్ తెలుగులో, శివ తెలుగు, తమిళ భాషల్లో ‘పరాశక్తి’ పేరుతో రానున్నారు. బిచ్చగాడు హీరో PARASHAKTHI స్పెల్లింగ్‌తో రిజిస్టర్ చేస్తే ‘డాక్టర్’ స్టార్ PARASAKTHI అని పేర్కొన్నారు. వేర్వేరు సినీ కౌన్సిళ్లలో భిన్న స్పెల్లింగుల కారణంగా ఈ వివాదం మొదలైంది. దీంతో కౌన్సిల్స్ బేసిక్ చెకింగ్స్ చేయాలి కదా అని సినీ జనాలు పెదవి విరుస్తున్నారు.

News January 30, 2025

2 పరుగులకే 6 వికెట్లు.. శార్దూల్ హ్యాట్రిక్

image

రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు అదరగొట్టారు. 2 పరుగులకే 6 వికెట్లు కూల్చేశారు. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సహా 4, మోహిత్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, అర్పిత్ సుభాష్ 2 పరుగులు చేశారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్ చేతిలో ముంబై అనూహ్యంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శార్దూల్ సెంచరీ చేశారు.

News January 30, 2025

ఉపాధి పనుల్లో ప్రమాదం.. తల్లీకూతురు మృతి

image

TG: సిద్దిపేట(D) అక్కన్నపేట(M) గోవర్ధనగిరిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడి తల్లి, కూతురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News January 30, 2025

1982 నాటి విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు!

image

USలోని వాషింగ్టన్‌లో 60 మంది ప్రయాణికులతో వెళ్తోన్న పీఎస్ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే, గతంలోనూ 1982లో ఈ ప్రమాద స్థలానికి దగ్గరలో జరిగిన ఘటనను అమెరికన్లు గుర్తుచేసుకుంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంతో ఎయిర్ ఫ్లోరిడా విమానం పోటోమాక్ నదిలో కూలడంతో 78 మంది మరణించారు. తాజా ప్రమాదానికి ఇలాంటిదేమైనా కారణమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు.

News January 30, 2025

OTTలో మీర్జాపూర్-3, సిటడెల్: హనీబన్నీ రికార్డులు

image

సిటడెల్: హనీబన్నీ, మీర్జాపూర్-3 వెబ్ సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు సృష్టించాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటడెల్’ గ్లోబల్ స్థాయిలో ఎక్కువ మంది వీక్షించిన నాన్ ఇంగ్లిష్ సిరీస్‌ల లిస్టులో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం 170 దేశాల్లో ఈ సిరీస్ టాప్-10లో చోటు దక్కించుకుంది. విడుదలైన వారాంతంలో దేశవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న జాబితాలో మీర్జాపూర్-3 టాప్-10లో నిలిచింది.

News January 30, 2025

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత

image

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ తల్లి లివి సురేశ్ బాబు (65) కన్నుమూశారు. కేరళలోని కూర్కెన్‌చెరిలోని తన అపార్టుమెంట్లో ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయాన్ని గోపి సోషల్ మీడియాలో వెల్లడించారు. మలయాళం సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపున్న ఆయన తెలుగులో‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి, 18 పేజెస్’ తదితర సినిమాలకు సంగీతం అందించారు.

News January 30, 2025

తెలంగాణ కాంగ్రెస్‌కు నెటిజన్ల షాక్!

image

తెలంగాణ కాంగ్రెస్‌కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ‘రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?’ అని అధికారిక X ఖాతాలో పోల్ పెట్టగా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అనే రెండు ఆప్షన్లు ఇవ్వగా ఫామ్ హౌస్ పాలనకు 73% మంది ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన పరువు తానే పోగొట్టుకుందని బీఆర్ఎస్ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి.

News January 30, 2025

పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు విద్యార్థులకు ఫ్రీ కౌన్సెలింగ్

image

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తొలగించేందుకు CBSE కీలక నిర్ణయం తీసుకుంది. FEB 1 నుంచి APR 4 వరకు IVRS, పాడ్‌కాస్ట్, ఫోన్ కాల్స్ ద్వారా ఫ్రీగా సైకో-సోషల్ కౌన్సెలింగ్ ఇవ్వనుంది. ఎగ్జామ్స్‌కు ముందు, ఆ తర్వాత ఈ సర్వీస్ అందించనుంది. టోల్‌ఫ్రీ నంబర్ 1800118004 ద్వారా IVRS సౌకర్యం ఉంటుంది. CBSE వెబ్‌సైట్‌లో పాడ్‌కాస్ట్‌లు ఉంటాయి. నిపుణులు నేరుగా విద్యార్థులకే కాల్ చేసి కూడా కౌన్సెలింగ్ ఇస్తారు.