News January 30, 2025
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ తల్లి లివి సురేశ్ బాబు (65) కన్నుమూశారు. కేరళలోని కూర్కెన్‌చెరిలోని తన అపార్టుమెంట్లో ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయాన్ని గోపి సోషల్ మీడియాలో వెల్లడించారు. మలయాళం సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపున్న ఆయన తెలుగులో‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి, 18 పేజెస్’ తదితర సినిమాలకు సంగీతం అందించారు.
Similar News
News February 20, 2025
PHOTOS: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోనికి స్వామివార్ల యాగప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. మార్చి 1 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
News February 20, 2025
ఫాస్టాగ్ 70 నిమిషాల రూల్‌పై NHAI క్లారిటీ

టోలోప్లాజాకు చేరుకునే ముందు 60 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. FEB 17 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై NHAI క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంక్ మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి NPCI ఈ సర్క్యూలర్ జారీ చేసిందని వెల్లడించింది.
News February 20, 2025
BREAKING: జగన్‌పై కేసు నమోదు

AP: మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా 8 మందిపై కేసు పెట్టారు.