News November 4, 2024

వెలుగులోకి శతాబ్దాల నాటి నగరం!

image

మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో వందల ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన మాయా నాగరికతకు చెందిన నగరాన్ని సైంటిస్టులు గుర్తించారు. దీనికి వలేరియానా అని పేరు పెట్టారు. రాజధాని తరహాలో ఉన్న ఈ సిటీలో 6,674 రకాల కట్టడాలను గుర్తించారు. పిరమిడ్లు, కాజ్‌వేలు, డ్యామ్‌లు, బాల్ కోర్ట్, కొండలపై ఇళ్లు ఉన్నాయి. 50 వేల మంది నివసించి ఉండొచ్చని అంటున్నారు. లిడార్ అనే లేసర్ సర్వే ద్వారా దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు.

News November 4, 2024

పుష్ప-2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

image

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.

News November 4, 2024

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

* 1888: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం
* 1929: ప్రపంచ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం
* 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ పుట్టినరోజు
* 1964: దర్శకుడు, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస రావు పుట్టినరోజు
* 1971: సినీనటి టబు పుట్టినరోజు(ఫొటోలో)

News November 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 4, 2024

ఇండియా-Aకు ఆడనున్న KL.. కారణమిదే!

image

NZతో టెస్ట్ సిరీస్‌‌లో ప్రాక్టీస్ లభించని ఆటగాళ్లను ఇండియా-A తరఫున ఆడించాలని BCCI నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా KL రాహుల్, ధృవ్ జురెల్‌ను రేపు ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. AUS-A, IND-A మధ్య జరిగే మ్యాచుల్లో వీరు ఆడనున్నట్లు పేర్కొన్నాయి. రాహుల్‌కు NZ సిరీస్‌లో తొలి టెస్ట్ మాత్రమే ఆడే అవకాశం రాగా, జురెల్ వికెట్ కీపింగ్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

News November 4, 2024

క‌డుపులో 65 వ‌స్తువులు.. 14 ఏళ్ల బాలుడు మృతి

image

ఇంట్లో చేతికి దొరికిన బ్యాటరీలు, చైన్‌లు మింగేయ‌డంతో UPలోని హ‌థ్రాస్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆదిత్య గ‌త కొన్ని రోజులుగా శ్వాస, ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అల్ట్రాసౌండ్ చేయగా కడుపులో 65 వ‌స్తువుల‌ను గుర్తించారు. ఢిల్లీ స‌ఫ్దార్‌జంగ్ ఆస్ప‌త్రి వైద్యులు వీటిని తొల‌గించిన కొన్ని గంట‌ల‌కే బాలుడు మృతి చెందాడు. ఇంట్లో పిల్లలు వస్తువుల్ని మింగకుండా జాగ్రత్తలు తీసుకోండి. SHARE IT.

News November 4, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: నవంబర్ 4, సోమవారం
✒ తదియ: రాత్రి 11.24 గంటలకు
✒ అనూరాధ ఉ.8.03 గంటలకు
✒ వర్జ్యం: మ. 2.03-3.46 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.12.13-12.59 గంటల వరకు
✒ తిరిగి మ.2.31-3.17 గంటల వరకు

News November 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 4, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 4, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 4, 2024

TODAY HEADLINES

image

➣TG: బీసీ కులగణనకు డెడికేషన్ కమిటీ: సీఎం రేవంత్
➣AP: అనకాపల్లిలో 1.40 లక్షల కోట్లతో మిట్టల్ స్టీల్ ప్లాంట్: TDP
➣TG: సంక్రాంతి తర్వాత రేషన్‌లో సన్నబియ్యం: ఉత్తమ్
➣త్వరలో నూతన ఎనర్జీ పాలసీ: భట్టి విక్రమార్క
➣AP: పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తాం: మంత్రి అనిత
➣సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీటింగ్: రోజా
➣2027లోనే మళ్లీ ఎన్నికలు: VSR
➣మధ్యంతర భృతి ప్రకటించాలి: ఏపీ జేఏసీ