News November 4, 2024

రేపు కప్పట్రాళ్లలో కీలక సమావేశం

image

AP: కర్నూలు జిల్లా దేవనకొండ(మ) కప్పట్రాళ్లలో రేపు కీలక సమావేశం జరగనుంది. యురేనియం పరీక్షలను వ్యతిరేకిస్తూ రెండ్రోజులుగా ఆందోళనలు చేస్తున్న స్థానికులను అధికారులు చర్చలకు ఆహ్వానించారు. కప్పట్రాళ్లతో పాటు సమీప గ్రామ ప్రజలకు ఆహ్వానాలు పంపారు. శాస్త్రవేత్తల బృందం, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ప్రజలతో చర్చించనున్నారు. వారిలో మెదులుతున్న అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

News November 4, 2024

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: VSR

image

AP: వక్ఫ్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు YCP రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. ‘ముస్లిం హక్కులకు భంగం కలిగే ఈ చట్టాన్ని అంగీకరించం. అన్నివేళలా మా పార్టీ వారి కోసం పోరాడుతుంది. ఈ బిల్లును TDP అంగీకరించింది. లోక్‌సభలో డ్రామాలు ఆడుతోంది. చట్టసవరణ ద్వారా వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని విజయవాడలో జరిగిన వక్ఫ్‌ పరిరక్షణ మహాసభలో VSR వెల్లడించారు.

News November 4, 2024

అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్‌.. TDPపై కాంగ్రెస్ విసుర్లు

image

AP: అనకాపల్లిలో రూ.1.4లక్షల కోట్ల పెట్టుబడితో మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని TDP చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ స్పందించింది. ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్రంతో చెప్పించగలరా? చాప కింద నీరులా ప్రైవేటీకరణ సాగుతోంది. దీన్ని పక్కదారి పట్టించేందుకు జనాలను మభ్యపెట్టే కబుర్లు ఇంకెన్నాళ్లు?2018లో CBN పునాది వేసిన కడప ఉక్కు పరిశ్రమ ఎంతవరకు వచ్చింది?’ అని ప్రశ్నలు సంధించింది.

News November 4, 2024

భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

image

భారత టెస్ట్ టీమ్‌లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్‌కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్‌పైనే ఉందని తెలిపారు.

News November 3, 2024

భారతీయ అమెరికన్లను ప్రభావితం చేస్తున్నవేంటి?

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఓటు వేయాల‌న్న విష‌యంలో 26 లక్ష‌ల మంది భారతీయ అమెరిక‌న్ ఓటర్లను కొన్ని కీల‌క‌ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ధరలు 37%, అబార్షన్ హక్కులు 13%, ఉద్యోగాలు 13%, ఇమిగ్రేషన్ 10%, ఆరోగ్య సంరక్షణ 9%, వాతావరణ మార్పులు 8%, పౌర స్వేచ్ఛ 7%, నేరాలు 6%, పన్నులు 5%, అమెరికా-భారత్ బంధాలు, విద్య, జాతీయ భద్రత చెరో 4% ప్ర‌భావితం చేస్తున్నట్టు American Attitudes Survey తేల్చింది.

News November 3, 2024

NICLలో 500 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైనా డిగ్రీ చదివి, 21-30 ఏళ్ల లోపు వారు అర్హులు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. SC, ST, PWD అభ్యర్థులు రూ.100, ఇతరులు రూ.850 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎంపికైన వారు రూ.22,405- రూ.62,265 వరకు జీతం అందుకోవచ్చు. అప్లై లింక్: https://ibpsonline.ibps.in/niclaoct24/

News November 3, 2024

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 23 మంది మృతి

image

గాజాలో ఉగ్ర‌వాద సంస్థ‌ హ‌మాస్ తిరిగి పుంజుకోకుండా ఇజ్రాయెల్ ద‌ళాలు దాడిని తీవ్ర‌ం చేశాయి. అదివారం ఉత్త‌ర గాజా స‌హా ప‌లు ప్రాంతాల‌పై జ‌రిపిన దాడుల్లో 23 మంది మృతి చెందారు. గత 48 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మంది చిన్నారులు మృతి చెందడంపై UNICEF ఖండించింది. మ‌రోవైపు లెబ‌నాన్‌లో హెజ్బొల్లాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో టాప్‌ కమాండర్‌ జాఫర్‌ ఖాదర్‌ ఫార్ హ‌త‌మ‌య్యారు.

News November 3, 2024

ఏపీలో ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ

image

ఏపీలో ముగ్గురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. YSR జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీషా, ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా అభిషిక్త్ కిషోర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News November 3, 2024

మా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు: YCP

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ వినుకొండ, గుడివాడ, భీమవరం, ఉదయగిరి, నెల్లూరు, పెనుగొండ, నందిగామ తదితర ప్రాంతాల్లో కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించకూడదంటూ లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని దుయ్యబట్టింది. ఈ అక్రమ అరెస్టులను చట్టపరంగా ఎదుర్కొంటామని Xలో పేర్కొంది.

News November 3, 2024

అనకాపల్లిలో భారీ స్టీల్ ప్లాంట్.. విశేషాలివే!

image

AP: ➫అనకాపల్లి(D) నక్కపల్లిలో మొదటి దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో మిట్టల్ <<14521702>>స్టీల్ ప్లాంట్<<>> నిర్మాణం. ఏడాదిలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.
➫రెండో దశలో రూ.60 వేల కోట్ల పెట్టుబడి. 10.5 మి. మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెంపు
➫పరిశ్రమ కోసం సుమారు 4600 ఎకరాలు కేటాయింపు
➫25 వేల మందికి ప్రత్యక్షంగా, 60 వేల మందికి పరోక్షంగా ఉపాధి
➫ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ముడి ఖనిజాన్ని పైపులైన్లతో తరలించే అవకాశం.