News November 2, 2024

ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తర్వాత ఆయనను జట్టు కెప్టెన్‌గా నియమిస్తారని సమాచారం. అయ్యర్ కోసం ఢిల్లీ భారీ మొత్తం వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్ అతనికి హామీ ఇచ్చినట్లు టాక్. కాగా గత సీజన్‌లో కేకేఆర్‌కు అయ్యర్ టైటిల్ సాధించిపెట్టినా ఆ ఫ్రాంచైజీ అతడిని వదిలేసింది.

News November 2, 2024

వైట్ హౌస్‌లోనూ ఇన్ని సౌకర్యాలు ఉండవేమో: చంద్రబాబు

image

AP: రిషికొండలో 18 ఎకరాల్లో భవనాలు కట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు. వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవని వ్యాఖ్యానించారు. ‘ఈ భవనాలను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదు. టూరిజం కోసం కడుతున్నట్లు అందరినీ నమ్మించారు. కోర్టులు జోక్యం చేసుకున్నా అధికారంతో దీనిని నిర్మించారు. నేను ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. కానీ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు ఎక్కడా చూడలేదు’ అని ఆయన మండిపడ్డారు.

News November 2, 2024

నా సలహా ఫీజు రూ.వంద కోట్లు: ప్రశాంత్ కిశోర్

image

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఫీజు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.100 కోట్లు. అవును ఏదైనా రాష్ట్రంలో అక్కడి పార్టీకి సలహాలు ఇచ్చినందుకు రూ.వంద కోట్లు తీసుకుంటారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. బిహార్‌లో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా బెలగంజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పది రాష్ట్రాల్లో తాను సలహాలు ఇచ్చిన ప్రభుత్వాలే గెలిచినట్లు తెలిపారు.

News November 2, 2024

పనిలో ఏకాగ్రత పెరగాలంటే?

image

ఉద్యోగంలో ఏకాగ్రత లోపిస్తోందా? రోజూ 8-9 గంటలు పనిచేస్తుండటంతో నిద్రమత్తు కమ్మేస్తోందా? ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కొన్ని చిట్కాలను వైద్యులు తెలియజేశారు. సుదీర్ఘ పని రోజుల్లో శ్రద్ధ, దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి ఇలా చేయండి. పని మధ్యలో శారీరక శ్రమ కోసం 10 నిమిషాలు నడవండి. ఫ్రెండ్స్‌తో కాఫీకి వెళ్లి రండి. సూర్యరశ్మి, ప్రకృతితో ఓ పది నిమిషాలు గడపండి. 10-20 నిమిషాలు చిన్న కునుకు తీయండి.

News November 2, 2024

ALERT.. కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News November 2, 2024

డిజిటల్ యాడ్స్‌కు పెరుగుతున్న క్రేజ్.. Google India ఆదాయం వృద్ధి

image

దేశంలో డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఆన్‌లైన్ ద్వారా త‌మ వ‌స్తువులు, ఉత్ప‌త్తుల ప్ర‌చారానికి వ్యాపారులు పెద్ద‌పీట వేస్తున్నారు. Google India ఆదాయం FY24లో గ‌త ఏడాదితో పోల్చితే 26% పెరిగి రూ.5,921 కోట్లుగా నమోదవ్వడమే అందుకు నిదర్శనం. భారత్‌లో డిజిటల్ అడాప్షన్ పెరగడంతో ప్రకటనల్లో వ‌ృద్ధి, ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తుల విక్రయాలు ఈ పెరుగుదలకు కారణమని సంస్థ తెలిపింది.

News November 2, 2024

ఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

News November 2, 2024

డెమోక్రాట్ల‌కు త‌గ్గుతున్న భారతీయ అమెరిక‌న్ల మ‌ద్ద‌తు

image

అమెరికాలోని 52 ల‌క్ష‌ల మంది భార‌తీయ అమెరిక‌న్ల‌లో ఈసారి అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో 26 ల‌క్ష‌ల మంది అర్హులు ఓటు వేయనున్నారు. గ‌తంలో ఉదార‌వాద భావాలున్న డెమోక్రాట్ల‌కు వీరు అనుకూలంగా ఉన్నారు. అయితే క్ర‌మేణా వారికి దూర‌మ‌వుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. 2020 ఎన్నిక‌ల్లో 56% మంది డెమోక్రాట్ల‌కు మ‌ద్దతు ఇవ్వ‌గా, 2024లో 47% మాత్ర‌మే స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు ఇండియ‌న్ అమెరిక‌న్ ఆట్టిట్యూడ్స్ స‌ర్వేలో తేలింది.

News November 2, 2024

అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు: మాజీ ప్రేయసి

image

గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ తెలిపారు. సల్మాన్‌తోపాటు గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని చెప్పారు. ‘ఓ రోజు సల్మాన్ ఫోన్‌కు ఎవరో కాల్ చేయగా నేను లిఫ్ట్ చేశా. సల్మాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం ఆయనతో చెప్పగానే కాస్త భయపడ్డారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్స్ రాలేదు’ అని గుర్తు చేసుకున్నారు.

News November 2, 2024

సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు: మంత్రి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశాం. మొత్తం 4 దశల్లో ఇళ్లు కేటాయిస్తాం. మొదటిదశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తాం. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాం. 400 చ.అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు దశల వారీగా ఇస్తాం. ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తాం’ అని ఆయన వెల్లడించారు.