News November 2, 2024

APPLY: నవంబర్ 28 వరకే ఛాన్స్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వాళ్లంతా 2024 నవంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు నమోదుకు ఫాం-6, అభ్యంతరాలకు ఫాం-7, సవరణలకు ఫాం-8 నింపాలి. voters.eci.gov.in లేదా voter helpline యాప్ ద్వారా కూడా దరఖాస్తు చూసుకోవచ్చు. > TOLL FREE 1950

News November 2, 2024

ఎలక్షన్ షెడ్యూల్.. సీఎం విజయనగరం పర్యటన రద్దు

image

AP: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ <<14509068>>షెడ్యూల్<<>> వెలువడిన నేపథ్యంలో ఇవాళ్టి సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన రద్దయ్యింది. దానికి బదులుగా అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారు. తొలుత చింతలగోరువానిపాలెంలోని లారెస్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత రుషికొండ భవనాలను పరిశీలిస్తారు.

News November 2, 2024

ట్రంప్ గెలవగానే యుద్ధానికి చెక్?

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అమెరికా మిలిటరీ, నిధులపై విపరీతంగా ఆధారపడుతోంది. 2022 నుంచి బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు 56 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేశారు. అయితే యుద్ధం ఆపితే భారీగా నిధులు ఆదా చేసుకుని అమెరికా అభివృద్ధికి ఖర్చు పెట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.

News November 2, 2024

ఎల్లుండి టెట్ ఫలితాలు.. 6న డీఎస్సీ నోటిఫికేషన్

image

AP: అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగిన టెట్ ఫలితాలను ఎల్లుండి మంత్రి లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్ రిజల్ట్స్ రాగానే ఈ నెల 6వ తేదీన 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనుంది.

News November 2, 2024

సికింద్రాబాద్‌‌ నుంచి పుణేకు వందే భారత్!

image

TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరో వందే భారత్‌ సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ నుంచి పుణేకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. అది మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుండగా ఈ వందే భారత్‌ను ఉదయం పంపించే అవకాశం ఉంది.

News November 2, 2024

సంక్రాంతిలోపే మహిళలకు ఫ్రీ జర్నీ: మంత్రి జనార్దన్‌రెడ్డి

image

AP: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల నినాదంతో ముందుకెళ్తున్నామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే ఫించన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామన్నారు. సంక్రాంతి పండుగలోపే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎన్నో పరిశ్రమలను తీసుకొస్తున్నారని తెలిపారు.

News November 2, 2024

మాకు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అవసరం: జెలెన్‌స్కీ

image

రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు <<14478334>>రంగంలోకి<<>> దిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపైకి లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను ప్రయోగించడానికి తమకు మిత్రదేశాల అనుమతి అవసరమన్నారు. ‘ఆ దేశంలో నార్త్ కొరియా సైనికులు ఉండే ప్రతి శిబిరాన్ని మేం గుర్తిస్తాం. మాకు తగిన సామర్థ్యంతో కూడిన క్షిపణులు ఉంటే వాటిపై దాడి చేయడానికి వీలవుతుంది’ అని పేర్కొన్నారు.

News November 2, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశువైద్య శిబిరాలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నేటి నుంచి ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. FEB నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. దీర్ఘకాలంగా గర్భం దాల్చని పశువులకు చికిత్స, ఎదలో ఉన్న వాటికి కృత్రిమ గర్భదారణ, సూడి పరీక్షలు చేస్తామన్నారు. దూడలకు నట్టల నివారణ మందులు, విటమిన్ ఇంజెక్షన్లు, పాల దిగుబడిపెంచే ఖనిజ లవణాల మిశ్రమాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

News November 2, 2024

ఆస్ట్రేలియా Aతో మ్యాచ్.. సాయి సుదర్శన్ సెంచరీ

image

ఆస్ట్రేలియా A జరుగుతోన్న మ్యాచులో ఇండియా A ఆటగాడు సాయి సుదర్శన్ మెరిశారు. ఓపెనర్లు రుతురాజ్, అభిమన్యు ఈశ్వరన్ విఫలం కాగా సుదర్శన్ సెంచరీ చేశారు. మరో యువ బ్యాటర్ పడిక్కల్ 88 పరుగులతో రాణించారు. ఇషాన్ కిషన్ 32, నితీశ్ కుమార్ రెడ్డి 17 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఇండియా A 199 పరుగుల ఆధిక్యంలో ఉంది.

News November 2, 2024

అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్

image

అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. TGలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చింది. భూమిని స్వాధీనం చేసుకోవడం, ఉపయోగించడంపై అభ్యంతరాలు ఉన్నవారు ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అభ్యంతరాలు తెలపాలంది.