News September 5, 2024

త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. వీరికి కీలక పదవులు?

image

TG: ఇప్పటికే 35 ప్రభుత్వ సంస్థల కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం మిగిలిన వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఓ ముగ్గురు MLAలకు RTC, సివిల్ సప్లై, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వాటిని ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే విద్య కమిషన్‌కు ఆకునూరి మురళి, BC కమిషన్‌కు నిరంజన్, రైతు కమిషన్‌కు కోదండరెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

News September 5, 2024

విజయ్ ‘ది గోట్’ మూవీ పబ్లిక్ టాక్

image

దళపతి విజయ్ ద్విపాత్రాభినయంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గోట్’ ప్రీమియర్లు పడ్డాయి. సినిమాలో స్క్రీన్ ప్లే, విజయ్ యాక్షన్, యువన్ బీజీఎం అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హీరో ఎలివేషన్లు అదిరిపోయాయని చెబుతున్నారు. మరికొందరేమో సినిమా బోరింగ్‌గా ఉందని, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా లేదని పోస్టులు చేస్తున్నారు.
మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News September 5, 2024

కన్వీనర్ కోటాలో 3,879 MBBS సీట్లకు నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న 3,879 ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వెబ్‌సైట్: <>https://drntr.uhsap.in/<<>>

News September 5, 2024

BIG ALERT: నేడు అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ అల్పపీడనంగా మారనుందని APSDMA వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంపై రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 9 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, NTR జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.

News September 5, 2024

నేటి నుంచి వరద ప్రాంతాల్లో వైద్య శిబిరాలు

image

AP: విజయవాడలో వరద తగ్గడంతో అంటువ్యాధులు, వైరల్ ఫీవర్లు సోకకుండా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. నగరంలోని 32 డివిజన్లలో ఇవాళ్టి నుంచి అదనంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ప్రతి వార్డు పరిధిలోని సచివాలయాలు, అంగన్‌వాడీ, ప్రభుత్వ కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం 104 మెడికల్ వెహికల్స్, 50కి పైగా వైద్య శిబిరాలు సేవలందిస్తున్నాయి.

News September 5, 2024

కాంగ్రెస్‌లోకి వినేశ్? రేపు స్పష్టత

image

రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు బజరంగ్ పునియా కూడా హస్తం కండువా కప్పుకుంటారని సమాచారం. నిన్న వీరిద్దరూ రాహుల్ గాంధీని కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీనిపై రేపు క్లారిటీ వస్తుందని AICC హరియాణా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు. కాగా హరియాణాలో అక్టోబర్ 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగుతారని సమాచారం.

News September 5, 2024

గురువులంటే టార్చర్ కాదు.. మంచి ఫ్యూచర్‌నిచ్చే టార్చ్‌బేరర్స్

image

గురువులు పాఠాలు, గుణపాఠాలు, జీవిత పాఠాలు బోధిస్తారు. ఆటలు, పాటలతో పాటు పోరాటాలు చేయడమూ నేర్పిస్తారు. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్నిస్తారు. టాలెంట్‌ను గుర్తించి శిక్షణనిస్తారు, తప్పు చేస్తే శిక్షిస్తారు. అయితేనేం తమ శిష్యులను ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహిస్తారు. అందుకే మంచి గురువులున్నవారి బతుకు, భవిష్యత్తు కూడా మంచిగానే ఉంటుంది.
✒ గురువులందరికీ HAPPY TEACHERS DAY

News September 5, 2024

గ్రూప్-4 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: గ్రూప్-4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు స్పెషల్ రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2022 DECలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

News September 5, 2024

విపత్తుపై అధికారిక సమాచారం అందలేదు: హోంశాఖ

image

తెలంగాణలో సంభవించిన ప్రకృతి విపత్తుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితులపై రోజూవారీ నివేదిక పంపేలా అధికారులను ఆదేశించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)కి లేఖ రాసింది. రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి టెలిఫోన్ ద్వారా అందిన సమాచారం ప్రకారం ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవసరమైన సామగ్రిని పంపించామని పేర్కొంది.

News September 5, 2024

పింఛన్ల పంపిణీ విధానంపై కీలక నిర్ణయం

image

AP: పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక L1 RD(రిజిస్టర్డ్) ఫింగర్‌ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ₹53 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లతో OCT నుంచి పింఛన్లు పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న L0 RD డివైజ్‌లలో సెక్యూరిటీ తక్కువగా ఉండటంతో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి.

error: Content is protected !!