India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై తిరుపతి తూర్పు PS పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నేను ఎలాంటి తప్పూ చేయలేదని ఆదిమూలం చెప్పారు. ‘రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే YCP నేతలు కుట్ర చేశారు. TDPకి నష్టం చేకూర్చను. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసా వహిస్తా. మహిళను అడ్డుపెట్టుకుని నాపై నిందలు వేశారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
బెంచ్‌మార్క్ సూచీల పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 81,400 (-800), నిఫ్టీ 24,927 (-217) వద్ద చలిస్తున్నాయి. US ఫెడ్ వడ్డీరేట్ల కోతపై US జాబ్ డేటా ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం అమెరికా, ఐరోపా మార్కెట్లు క్రాష్ అవ్వడమూ ఇందుకు తోడైంది. ఇంట్రాడేలో ఇండియా విక్స్ 8% పెరిగింది. SBI, రిలయన్స్ తీవ్రంగా నష్టపోయాయి. VI షేర్లు 13% క్రాష్ అయ్యాయి.
తన స్టేట్‌మెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ‘టీచ్ ఫర్ ఇండియాస్ లీడర్స్’ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనలా కావొద్దని విద్యార్థులకు సూచించారు. ఈవెంట్‌లో ఓ 12 ఏళ్ల విద్యార్థి ‘మీలా కావాలంటే ఏం చేయాలి’ అని మూర్తిని ప్రశ్నించాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మీరు నాలా కావడం నాకిష్టం లేదు. దేశానికి మరింత మేలు చేసేలా నాకంటే గొప్పవాళ్లు కావాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో కేసీఆర్ కూతురు కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా KCR 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆమెపై సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే కోర్టులో అభియోగాలు దాఖలు చేయనున్నట్లు తెలిపాయి. కాగా ఈ కేసును తొలుత పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణపై అనుమానాలు రేకెత్తడంతో హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.
AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత YCP పునర్నిర్మాణ దిశగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నిర్మాణంలో సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్‌ను నియమించారు. ఈయన చెన్నై IITలో చదివారు. సాయిదత్ టీమ్ TG లోక్‌సభ ఎన్నికల్లో BJPకి పనిచేసింది. ఢిల్లీలో ఆ పార్టీ నాయకుడికి ఫీడ్‌బ్యాక్ టీమ్‌గానూ సేవలందించింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈయన గతంలో మంగళగిరిలో లోకేశ్ వ్యూహకర్తగా పనిచేసినట్లు సమాచారం.
AP: విజయవాడ వరద బాధితులకు అధికారులు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ 25 కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు అందిస్తున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో రేషన్ వాహనాలు విజయవాడకు చేరుకున్నాయి.
తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మిత్రుడు, సన్నిహితుడు బాలకృష్ణారెడ్డి అకాల మరణం కలిచివేసింది. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
RBI ఏర్పడి వచ్చే ఏడాది APR1 నాటికి 90 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు ‘RBI 90’ పేరుతో క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 17 వరకు <
మణిపుర్‌లోని బిష్ణుపుర్ జిల్లాలో మిలిటెంట్లు ఉదయం బాంబులతో దాడి చేశారు. పక్కనే ఎత్తుమీదున్న చురాచంద్‌పుర్ జిల్లాలోని కొండప్రాంతం నుంచి జనావాసమైన ట్రాంగ్‌లావోబీ లక్ష్యంగా రాకెట్లు ప్రయోగించారు. అవి కనీసం 3 కి.మీ దాటొచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని, కమ్యూనిటీ హాల్, ఖాళీ గది ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఇంఫాల్‌లో డ్రోన్ బాంబు దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.