India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత టీమ్‌కు ‘హాకీ ఇండియా’ నజరానా ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.7.5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు జట్టులోని తమ రాష్ట్ర ప్లేయర్లకు రూ.కోటి చొప్పున బహుమతి ఇస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో శంకర్ పాత్ర మెంటల్, మాస్, మ్యాడ్ నెస్‌తో ఉంటుందని హీరో రామ్ పోతినేని అన్నారు. ముంబైలో ‘బిగ్ బుల్’ పాట రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను శంకర్‌ను ప్రమోట్ చేయడం లేదని చెప్పారు. ఒకవేళ మీరు శంకర్‌లా ఉండాలని అనుకుంటే అరగంటలోనే జైల్లో ఉంటారని అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఆ పాత్ర కేవలం స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయడానికే బాగుంటుందని తెలిపారు.
ఒలింపిక్స్ వరకు చేరుకొని గోల్డ్ సాధించాలని ప్రతి అథ్లెట్ కోరుకుంటారు. కానీ, ఎంతోమందికి అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. కానీ, 17ఏళ్ల వయసులోనే కెనడియన్ స్విమ్మర్ సమ్మర్ మెకింతోష్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించి ఔరా అనిపించారు. ఉమెన్స్ 200M బటర్‌ఫ్లై, 200M & 400M ఇండివిడ్యువల్ మెడ్లీ స్విమ్మింగ్‌లో మూడు గోల్డ్, 400M ఫ్రీస్టైల్‌లో సిల్వర్ సాధించారు.
APలో 10,960 గ్రామ, 4044 వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు, చేర్పులు జరిగే ఛాన్సుంది. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులోని కార్యదర్శులను ఇతర అవసరాలకు వాడుకునేలా కసరత్తు చేస్తోంది. సచివాలయాల్లో ANM, VRO, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ, మహిళా సంరక్షణ కార్యదర్శి ఉండేలా యోచిస్తోంది. గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది.
ఒలింపిక్స్ నుంచి డిస్‌క్వాలిఫై చేయడంపై వినేశ్ ఫొగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో వేసిన కేసు రేపు విచారణకు రానుంది. ఆమె తరఫున వాదించడానికి ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వేను భారత ప్రభుత్వం నియమించింది. అయితే అందుకు ఆయన అంగీకరించాల్సి ఉంది. గతంలో పాక్ బందీ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించారు. అందుకు రూపాయి ఫీజు తీసుకున్నారు. హైప్రొఫైల్ కేసులు వాదించడంలో సాల్వే దిట్ట.
APలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేశారు. ‘జులైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి. రెండేళ్లలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెంచాలి. నిమ్మ, టమాట, మామిడి పంటల విలువ పెంచేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి’ అని CM సూచించారు.
శ్రావణ మాసంలోని శుక్ల పక్షం 5వ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. రేపు ఉదయం 06.01 నుంచి 8.37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అటు వేద పంచాంగం ప్రకారం పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12.36 గంటలకు ప్రారంభమై 10వ తేదీ తెల్లవారుజామున 03.14 గంటలతో ముగుస్తుంది.
AP: దక్షిణ భారత్‌కు మంగళగిరిని గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 25 ఎకరాల్లో ఈ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక స్వర్ణకారులకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు చేసేలా శిక్షణ ఇస్తామన్నారు. పద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో భార్య బ్రాహ్మణితో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ సెమీస్‌లో అమన్ సెహ్రావత్ ఓడిపోయారు. వరల్డ్ నంబర్ వన్ సీడ్ హిగుచీ చేతిలో 0-10 తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో రేపు జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో అమన్ బరిలోకి దిగనున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం భారత గోల్‌పోస్ట్‌కు అతడు అడ్డుగోడలా నిలబడ్డారు. అయితే శ్రీజేశ్‌కు ఇదే చివరి మ్యాచ్. ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవుతానని అతడు గతంలోనే ప్రకటించారు. దీంతో ఇవాళ మ్యాచ్ ముగిసిన తర్వాత గోల్‌పోస్ట్ పైకి ఎక్కి కూర్చున్న అతడి ఫొటోలు వైరల్ అవతున్నాయి. ‘THANK YOU LEGEND’ అంటూ క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.