News November 1, 2024

దీపావళి వేడుకల్లో క్రికెటర్లు

image

దీపావళి సందర్భంగా స్టార్ క్రికెటర్లు తమ కుటుంబాలతో ఘనంగా వేడుకలు చేసుకున్నారు. ధోనీ- సాక్షి, బుమ్రా-సంజన, కృనాల్ పాండ్య-పంఖూరి శర్మ, హార్దిక్ పాండ్య తన కొడుకుతో సందడి చేశారు. బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తమ భార్య, పిల్లలతో ఒకేచోట కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News November 1, 2024

J&K బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

image

జమ్మూకశ్మీర్‌‌లోని నగ్రోటా BJP MLA దేవేందర్ సింగ్ రాణా(59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్‌కు ఈయన సోదరుడు. దేవేందర్ మృతిపై J&K Dy.cm సురేందర్, PDF చీఫ్ ముఫ్తీ, BJP నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈయన 2014లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి MLAగా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరి తాజాగా 30,472 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

News November 1, 2024

మీ ప్రేమకు ధన్యుడను: కిరణ్ అబ్బవరం

image

నిన్న రిలీజైన ‘క’ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ‘సినిమాల్లో ఎవరికైనా విజయం వస్తే హిట్ కొట్టాడు అంటారు. నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశామ్ అంటున్నారు. సక్సెస్ కంటే మీరు నాపైన చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను మాటల్లో చెప్పలేను. ఇందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

News November 1, 2024

మస్క్.. మార్స్.. రాజకీయం

image

US ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం చేయడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ‘మార్స్‌పై మానవ కాలనీల స్థాపనకు మస్క్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ.. ‘నిజమే. ట్రంప్ గెలిస్తే మార్స్‌పైకి చేరుకోవడంతోపాటు అక్కడ జీవనం, ప్రయోగాలకు వీలవుతుంది. అందుకే పాలిటిక్స్‌లో చురుగ్గా ఉంటున్నా’ అని రాసుకొచ్చారు.

News November 1, 2024

NPCIకి రాజీనామా.. MCX ఎండీగా ప్రవీణా రాయ్

image

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా COO ప్రవీణా రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్(MCX) MD, CEOగా బాధ్యతలు చేపట్టారు. ఈమె నియామకానికి ‘సెబీ’ ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఆమెకు 30ఏళ్ల అనుభవం ఉంది. కోటక్ మహీంద్రా, సిటీ బ్యాంక్, HSBC బ్యాంకుల్లో పని చేశారు. NPCIలో బిజినెస్ స్ట్రాటజీ, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షించారు.

News November 1, 2024

ఎవరు కావాలో మాకు తెలుసు: పార్థ్ జిందాల్

image

రిషభ్ పంత్‌ను DC అట్టిపెట్టుకోకపోవడం, జట్టు కూర్పుపై కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. ‘ఎవరు కావాలో మాకు తెలుసు. అనుభవం, యంగ్ ప్లేయర్ల కలయికతో అక్షర్, కుల్దీప్, స్టబ్స్, పొరెల్‌ను రిటైన్ చేసుకున్నాం. ఇందుకు హ్యాపీగానే ఉన్నాం. మాకు రెండు RTM కార్డులున్నాయి. గతంలో ఢిల్లీకి ఆడిన ఆటగాళ్లను కొనసాగించుకునే అవకాశం ఉంది. మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News November 1, 2024

ట్రంప్ అసభ్యంగా తాకి ముద్దు పెట్టారు.. స్విస్ మోడల్ బీట్రైస్ కీల్

image

ట్రంప్ లైంగిక దుష్ప్ర‌వ‌ర్త‌న‌పై మ‌రో మోడ‌ల్ ఆరోప‌ణ‌లు గుప్పించారు. 1993లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో డోనాల్డ్ ట్రంప్ తనను అనుచితంగా తాకి, పెదాల‌పై ముద్దు పెట్టారని స్విస్ మోడ‌ల్‌ బీట్రైస్ కీల్ ఆరోపించారు. దీంతో ట్రంప్‌పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోప‌ణ‌ల సంఖ్య 28కి చేరింది. ఇటీవ‌ల మోడ‌ల్ స్టాసీ విలియమ్స్ కూడా ట్రంప్‌పై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు. అయితే, ట్రంప్ బృందం ఈ ఆరోప‌ణ‌ల్ని ఖండించింది.

News November 1, 2024

English Learning: Antonyms

image

✒ Bleak× Bright, Cheerful
✒ Bold× Timid
✒ Boisterous× Placid, Calm
✒ Blunt× Keen, Sharp
✒ Callous× Compassionate, Tender
✒ Capable× Incompetent, Inept
✒ Calamity× Fortune
✒ Calculating× Artless, honest
✒ Calumny× Commendation, Praise

News November 1, 2024

వరదల కల్లోలం.. 158 మంది దుర్మరణం

image

స్పెయిన్‌లో భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఇప్పటి వరకు 158 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వాలెన్సియా సిటీలోని 155 మంది మృత్యువాత పడినట్లు తెలిపారు. వరదల తర్వాత పరిస్థితి భయానకంగా ఉంది. కొట్టుకుపోయిన వాహనాల్లోనే మృతదేహాలు బయటపడుతున్నాయి. భారీ వృక్షాలు నేలకూలగా విద్యుత్ లైన్లు, రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి.

News November 1, 2024

టెక్సాస్ ‘ది హిల్స్’ మేయర్ పోటీలో ఏపీ యువకుడు

image

US టెక్సాస్‌లోని ‘ది హిల్స్’ పట్టణ మేయర్ ఎన్నికల్లో బాపట్ల(D)కు చెందిన కార్తీక్ నరాలశెట్టి(35) పోటీ చేస్తున్నారు. ‘నో క్లోజ్డ్‌ డోర్స్‌, జస్ట్ ఓపెన్‌ కన్వర్జేషన్స్‌’ నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 5న జరిగే పోలింగ్‌లో విజయం సాధిస్తే ది హిల్స్ మేయర్ పదవి చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా నిలుస్తారు. ఢిల్లీలో చదివిన ఆయన ఉన్నతవిద్య కోసం అమెరికా వెళ్లి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.