India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆ ఘటన దురదృష్టకరం. 20మంది భక్తులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. చాలా బాధాకరం. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఓ ప్రకటనలో తెలిపారు.

గర్భస్థ శిశువు కడుపులో మరో బిడ్డ ఉన్న ఆసక్తికర ఘటన ఇది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ మహిళ(32) గర్భంలో ఈ పరిస్థితిని వైద్యులు గుర్తించారు. ఇది అత్యంత అరుదుగా జరుగుతుంటుందని, దీన్ని ‘ఫీటస్ ఇన్ ఫీటు’గా పిలుస్తామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 200మాత్రమే వెలుగుచూశాయని పేర్కొన్నారు. కాన్పు సాధారణంగానే అయ్యే అవకాశం ఉందని, డెలివరీ అనంతరం బిడ్డను ప్రత్యేక సంరక్షణలో ఉంచుతామని తెలిపారు.

తెలంగాణలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశం దృష్టిని ఆకర్షించిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన పూర్తవ్వడంపై బుధవారం ఆయన మంత్రులు, అధికారులతో సమీక్షించారు. సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని, దీనికి కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని, పూర్తి నివేదికను Feb 2లోగా క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని అధికారులు తెలిపారు.

పారా అథ్లెట్ ఆర్చర్ శీతల్ దేవికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్కార్పియో-N కారును గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె ట్వీట్ చేశారు. ‘నాకు 16ఏళ్లు ఉన్నప్పుడు ఆనంద్ సర్ కాల్ చేశారు. కారు గిఫ్ట్ ఇస్తా అని చెబితే నాకు 18ఏళ్లు వచ్చాక తీసుకుంటా అని జవాబిచ్చా. నా బర్త్ డే తర్వాత సర్‌ను కలిశాను. నా గ్రామంలోని కఠినమైన రోడ్లకు ఈ కారు సెట్ అయిపోయింది. ధన్యవాదాలు సర్’ అని తెలిపారు.

ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకును దక్కించుకున్నారు. ఫిల్ సాల్ట్‌ను మూడోస్థానానికి నెట్టి 832 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నారు. సాల్ట్‌కు 782పాయింట్లున్నాయి. ఇక అగ్రస్థానంలో ట్రావిస్ హెడ్ (855 పాయింట్స్) ఉన్నారు. ఇంగ్లండ్‌తో రెండో టీ20లో ఓవైపు వికెట్లు పడుతున్నా తిలక్ అడ్డుగా నిలబడి 72 పరుగులతో జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే.

TG: సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, సీతక్క, దామోదర, పొన్నం హాజరయ్యారు. సీనియర్ నేతలు జానారెడ్డి, కె.కేశవరావు తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదీలపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. గురువారం నుంచి అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘పుష్ప-2’ సినిమాను చూసేయొచ్చు. అయితే, రీలోడెడ్ వెర్షన్ మాత్రం కొద్దిరోజుల తర్వాతే రిలీజ్ కానుందని తెలిపింది. మరి ఈ సినిమా కోసం మీరూ వెయిట్ చేస్తున్నారా?

ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాక మిగిలిన డబ్బుతో EMIలో కారు కొంటే 48శాతం ట్యాక్స్ వసూలు చేయడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను 31.2% చెల్లించిన తర్వాత మళ్లీ ఎందుకు 48% ట్యాక్స్ కట్టాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మీ దోపిడీకి హద్దు అదుపూ లేదా? మీ అసమర్థతతో దేశాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. ఇది పూర్తిగా సిగ్గుచేటు’ అని ఓ నెటిజన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు.

AP: మహా కుంభమేళాలో తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది తరలిరావడంతో అర్ధరాత్రి సెక్టార్-2 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు.

ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోవడం విషాదం నింపింది. అయితే దేశంలోని కుంభమేళాల్లో తొక్కిసలాట జరగడం ఇదేమీ తొలిసారి కాదు. స్వతంత్ర భారత్‌లో 1954లో నిర్వహించిన తొలి మేళాలో తొక్కిసలాట జరిగి 800 మంది మరణించారు. 1986లో హరిద్వార్‌లో 200 మంది, 2003లో నాసిక్‌లో 39 మంది, 2013లో అలహాబాద్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
Sorry, no posts matched your criteria.