News January 29, 2025
మొదలైన రివ్యూ మీటింగ్.. ఎన్నికలపై ప్రకటన ఉంటుందా?

TG: సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, సీతక్క, దామోదర, పొన్నం హాజరయ్యారు. సీనియర్ నేతలు జానారెడ్డి, కె.కేశవరావు తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదీలపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Similar News
News February 19, 2025
2 రోజులు సెలవు

AP: పట్టభద్రుల, టీచర్స్ MLC స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో(ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్స్) 2 రోజులు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు FEB 26, పోలింగ్ రోజైన 27 తేదీల్లో సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్(MAR 3) రోజునా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 16 జిల్లాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరగనుంది.
News February 19, 2025
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్‌కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.
News February 19, 2025
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

AP: నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.