News January 29, 2025

కేటీఆర్, హరీశ్ నా కాలి గోటికి సరిపోరు: మంత్రి

image

KTR <<15289834>>విమర్శలపై<<>> మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహించారు. KTR, హరీశ్ తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. KCR అల్లుడిగా, కొడుకుగా వాళ్లిద్దరూ నాయకులు అయ్యారని వ్యాఖ్యానించారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. తెలంగాణ కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాటం చేశారని అన్నారు. బండి సంజయ్ కంటే ముందు నుంచే గద్దర్ ఉద్యమంలో ఉన్నారని పేర్కొన్నారు.

News January 29, 2025

తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సానుభూతి: ప్రధాని మోదీ

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకొనేందుకు స్థానిక పాలకబృందం పనిచేస్తోందని తెలిపారు. యూపీ సీఎం యోగితో నిరంతరం మాట్లాడుతున్నానని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.

News January 29, 2025

సురక్షితంగా వ్యోమగాములను తీసుకురండి: మస్క్‌కు ట్రంప్ ఆదేశం

image

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను తీసుకురావడంలో బైడెన్ విఫలమయ్యారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ‘2024 జూన్‌లో వెళ్లిన వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురాలేకపోయారు. వెంటనే వారిని సురక్షితంగా తీసుకురావాలని స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌ను ఆదేశిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. మస్క్ దీనికి సానుకూలంగా స్పందించారు.

News January 29, 2025

పసిడి ధరలు పైపైకి

image

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.920 పెరిగి రూ.82,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.850 పెరిగి రూ.75,950గా నమోదైంది. అటు కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

News January 29, 2025

భారత స్టాక్‌మార్కెట్లకు టైమొచ్చింది: మోర్గాన్ స్టాన్లీ

image

భారత స్టాక్‌మార్కెట్లలో రివర్సల్‌కు టైమొచ్చిందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు పేర్కొంది. చాలా అంశాలు పటిష్ఠ రికవరీని సూచిస్తున్నాయంది. ‘గ్రోత్ తగ్గడం మార్కెట్లపై ప్రభావం చూపింది. త్వరలోనే గ్రోత్ పెరుగుతుందని మా విశ్వాసం. ఫోర్స్‌ఫుల్ సెల్లింగ్ తగ్గింది. పడిపోతున్న ట్రేడింగ్ వాల్యూమ్స్ దీనినే సూచిస్తున్నాయి. ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు బెస్ట్ రిస్క్ రివార్డు ఆఫర్ చేస్తున్నాయి’ అని పేర్కొంది.

News January 29, 2025

అతడి వల్లే ఓడిపోయాం: సూర్యకుమార్

image

అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వల్లే మూడో టీ20లో ఓడిపోయామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయనీయలేదని, అందుకే ఆయన వరల్డ్ బెస్ట్ స్పిన్నర్‌గా మారారని కితాబిచ్చారు. కాగా రెండో టీ20లో అద్భుతంగా ఆడి భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మను నిన్నటి మ్యాచ్‌లో రషీద్ క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను వారి వైపు తిప్పారు. చివరికి భారత్ 26 రన్స్ తేడాతో ఓడిపోయింది.

News January 29, 2025

సైఫ్‌ కేసు.. అన్ని ఆధారాలున్నాయి: పోలీసులు

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో షరీఫుల్ ఫకీర్ దోషి అని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలన్నీ ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాడికి సంబంధించిన వివరాలు అతడే చెప్పాడని తెలిపారు. సైఫ్ ఇంట్లో సేకరించిన వేలి ముద్రలు నిందితుడితో మ్యాచ్ అవ్వలేదన్న వార్తలపై స్పందించారు. CID నుంచి తమకు ఇంకా ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ రాలేదని, దాడి ఘటనలో కచ్చితంగా ఫకీర్ ప్రమేయం ఉందని చెప్పారు.

News January 29, 2025

బీమా డబ్బు కోసం చెల్లెలిపై అన్న ఘాతుకం

image

AP: ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే సోదరుడు హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాటూరివారిపాలేనికి చెందిన సంధ్యకు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టకపోవడంతో భర్త వదిలేశాడు. దీంతో ఆమె తన అన్న అశోక్ కుమార్ వద్ద ఉంటోంది. రియల్ ఎస్టేట్‌లో నష్టపోయిన అశోక్ తన చెల్లెలిపై వేర్వేరు కంపెనీల్లో రూ.1.20 కోట్లకు ఇన్సూరెన్స్ చేసి చంపేశాడు. ఈ ఘటన గతేడాది జరగ్గా పోలీసుల విచారణలో ఇప్పుడు బయటపడింది.

News January 29, 2025

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించదు: కవిత

image

TG: వేరుశనగ రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని BRS MLC కవిత ప్రశ్నించారు. ‘వేరుశెనగ రైతుల ఆందోళనలు ఈ సర్కారుకు కనిపించడం లేదా? దిగుబడి అంతంతమాత్రంగా ఉంటే.. ఇప్పుడు గిట్టుబాటు ధరా లేదు. అటు వ్యాపారుల మోసాలు, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం కలగలిపి రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వాన్ని క్షమించదు’ అని మండిపడ్డారు.

News January 29, 2025

ప్యాలెస్ నుంచి పాలన.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?: హరీశ్ రావు

image

TG: జూబ్లీహిల్స్‌ ప్యాలెస్ నుంచి CM రేవంత్ పాలన సాగిస్తున్నారంటూ BRS MLA హరీశ్ రావు మండిపడ్డారు. ‘ప్రజాపాలన అంటివి, క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ అంటివి. రోజూ ప్రజలను కలుస్తా అంటివి. ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి. అధికారిక నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉంటూ మంత్రులు, అధికారులను నీ వద్దకు పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నావు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?’ అని ప్రశ్నించారు.