India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. పసికూనలుగా అడుగుపెట్టిన జట్లు బలమైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నాయి. జూన్ 5న PNGపై ఉగాండా గెలవగా, జూన్ 6న పాకిస్థాన్‌ను USA ఓడించింది. నిన్న ఐర్లాండ్‌ను కెనడా ఓడించగా, తాజాగా న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్ చిత్తు చేసింది. నేడు నెదర్లాండ్స్, సౌతాఫ్రికా మ్యాచ్ ఉంది. ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో SAను NED రెండుసార్లు ఓడించింది. ఈరోజు ఏమవుతుందో?
రామోజీరావు మృతి పట్ల TBJP చీఫ్ జి.కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘చిత్తశుద్ధి, అంకితభావంతో కష్టించి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి రామోజీరావు జీవితం ఒక చక్కటి ఉదాహరణ. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్రవేశారు. జర్నలిజానికి ఓ గొప్ప గుర్తింపును కల్పించారు. ఆయన రాసిన ప్రతి అక్షరం, వేసిన ప్రతి అడుగూ తెలుగుదనమే’ అని పేర్కొన్నారు. రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.
రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచగా నటుడు జూ.ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి నివాళులర్పించారు. ఆయనకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి పయనమయ్యారు.
రామోజీరావు మృతిపట్ల దర్శకధీరుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. తన కృషితో 50 ఏళ్లుగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఆయనను ‘భారతరత్న’తో సత్కరించాలని అన్నారు. అదే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని పేర్కొన్నారు. రామోజీరావు భారతీయ మీడియాలో విప్లవాత్మక కృషి చేశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు దగ్గుబాటి వెంకటేశ్ ట్వీట్ చేశారు.
AP: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు వసూళ్లు నిలిపివేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసిన సంగతి తెలిసిందే.
తొలిసారి T20WC ఆడుతున్న USA రెండు మ్యాచుల్లోనూ గెలిచి ప్రస్తుతం గ్రూప్-ఏ టాపర్‌గా ఉంది. ఆ తర్వాత భారత్, కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. PAKపై గెలుపుతో USAకు సూపర్8పై ఆశలు చిగురించాయి. ఆ జట్టుకు భారత్, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లున్నాయి. భారత్‌తో ఓడినా.. ఫామ్‌లో లేని ఐర్లాండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ అదే జరిగితే IND, USA సూపర్8 వెళ్లొచ్చు. పాక్ గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించక తప్పదు.
మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.
రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై పొలిటికల్ లీడర్లు KTR, హరీశ్, షర్మిల సంతాపం ప్రకటించారు. ‘రామోజీ మృతితో బాధపడ్డాను. రామోజీ స్వీయ నిర్మిత వ్యక్తి, ఆయన కథ స్ఫూర్తిదాయకం’ అని కేటీఆర్ అన్నారు. ‘అనేక రంగాల్లో అద్భుత విజయాలందుకుని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు’ అని షర్మిల.. ‘రామోజీరావు తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
వందేభారత్ రైళ్ల సగటు వేగం గత మూడేళ్లలో 84.48Kmph నుంచి 76.25Kmphకి తగ్గిందని RTI కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం ఢిల్లీ-ఆగ్రా మార్గంలో 160KM ఉండగా, మిగతా ప్రాంతాల్లో 130km లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఆ పనులు పూర్తయిన తర్వాత రైళ్లు 250km వేగంతో వెళ్తాయని చెబుతున్నారు.
టీ20వరల్డ్ కప్‌లో శ్రీలంకకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9వికెట్లకు 124 రన్స్ మాత్రమే చేసింది. ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమితో శ్రీలంక సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Sorry, no posts matched your criteria.