India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: YCP ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసి, ఆపై ఆధారాలను ధ్వంసం చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ‘దీనిపై నాకు స్పష్టమైన సమాచారం అందింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం మాకందరికీ తెలుసు. నా ఫోన్‌పై పెగాసస్ దాడి జరిగిందని గతంలో చెప్పాను. నా ఫోన్‌పై రెండుసార్లు పెగాసస్ అటాక్ జరిగిందనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చివరగా ఏప్రిల్‌లో అటాక్ అయింది’ అని ANI ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి స్టాక్ మార్కెట్ కోలుకుంటున్నా ‘మోదీ స్టాక్స్’ ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థ CLSA పేర్కొన్న ఈ 54 స్టాక్స్‌లో 8 మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌కు ముందున్న (జూన్ 1కు ముందు) స్థాయికి చేరుకున్నాయి. వీటిలో కొన్ని మే 31తో పోలిస్తే ఇంకా 10శాతానికిపైగా నష్టాల్లో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా మోదీ స్టాక్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, HAL, SBI తదితర సంస్థలు ఉన్నాయి.
ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోదీకి టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ Xలో అభినందనలు తెలియజేశారు. భారత్‌లో తన సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో టెస్లా ప్లాంట్ సహా పలు వ్యాపారాలపై ప్రధాని మోదీని ఏప్రిల్‌లోనే కలవాల్సి ఉన్నా ఆఖరి నిమిషంలో మస్క్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే దీనిపై అప్పట్లో స్పందించిన మస్క్, ఈ ఏడాదిలో తప్పకుండా భారత్ వస్తానన్నారు.
తాను 2029 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. ఎంపీగా తనవంతు కృషి చేశానని, ఇక యువతకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాని పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో ప్రజాసేవను కొనసాగిస్తాను. అందుకు ఎంపీగానే ఉండక్కర్లేదు. ఎప్పుడు తప్పుకోవాలి అనే విషయంపైన నేతలకు అవగాహన ఉండాలి’ అని తెలిపారు. కాగా 2009 నుంచి ఇప్పటివరకు తిరువనంతపురం ఎంపీగా థరూర్ నాలుగుసార్లు గెలుపొందారు.
ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ కేటగిరి సెమీస్‌లో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) గెలుపొందారు. జానిక్ సిన్నర్ (ఇటలీ)పై 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. మూడు రకాల మైదానాల్లో (గ్రాస్, క్లే, హార్డ్) గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరిన పిన్నవయస్కుడిగా (21) అల్కరాజ్ నిలిచారు. ఇప్పటికే వింబుల్డన్, US ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న అల్కరాజ్‌కు ఇది తొలి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్.
AP: మాజీ CM జగన్ తన సలహాదారుల మాటలు, నివేదికలు, గణాంకాలను నమ్మి మునిగిపోయారన్నది పార్టీ వర్గాల ఆవేదన. ఒక్క సలహాదారు కూడా జగన్‌కు సరైన దారి చూపించలేదన్నది వారి ఆరోపణ. పార్టీకి ఎవరు అవసరమో వారిని దూరం పెట్టి, ఎవరు హానికరమో వారిని దగ్గరకు చేర్చడం వల్లే ఓటమి ఎదురైందని వారు నమ్ముతున్నారు. ఎప్పుడూ జనం మధ్యే ఉండే జగన్‌ను సీఎం అయ్యాక ఆ జనాలకే దూరం చేశారని.. అందుకే ప్రజలు కూడా జగన్‌ను దూరం పెట్టారని టాక్.
1919: సినీ దర్శకుడు వేదాంతం రాఘవయ్య జననం
1946: నటుడు గిరిబాబు జననం
1957: నటి డింపుల్ కపాడియా జననం
1975: నటి శిల్పా శెట్టి జననం
1938: స్వాతంత్ర్య సమరయోధుడు బారు రాజారావు మరణం
2002: సంఘ సేవకుడు, పద్మభూషణ్ గ్రహీత భూపతిరాజు విస్సంరాజు మరణం
2015: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య మరణం
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో కెనడా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెనడా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. ఛేదనలో ఐర్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 125 రన్స్‌కే పరిమితమైంది. కెనడా బ్యాటర్లు నికోలస్ కిర్టన్ 49(35), శ్రేయస్ మొవ్వ 37(36) సహా బౌలర్లు జెరెమీ, దిల్లోన్ (చెరో రెండు వికెట్లు), జాఫర్, జునైద్ (చెరొక వికెట్) రాణించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
లోక్‌సభ ఎన్నికల్లో నంబర్ల పరంగా తన ప్రీ పోల్ అంచనాలు తప్పాయని ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము BJPకి 300 సీట్లు వస్తాయని చెబితే 240 వచ్చాయని పేర్కొన్నారు. ‘ప్రజల్లో మోదీపై తీవ్ర వ్యతిరేకత లేదు. BJP ఓటు శాతం యథాతథంగా ఉంది. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ మద్దతుదారుల్లో మాత్రమే రాహుల్ ఇమేజ్ పెరిగింది. ఆ పార్టీకి ఇప్పుడు వచ్చిన సీట్లు(99) INC చరిత్రలోనే మూడో అతి తక్కువ సీట్లు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Sorry, no posts matched your criteria.