India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో భారత విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. దాదాపు 3 లక్షల మంది భారత విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. చదువుకునేందుకు డబ్బు లేక, చదువు మధ్యలో వదిలేసి స్వదేశానికి రాలేక తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో చదవాలంటే దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, చాలామంది అప్పు చేసే అక్కడికి వెళ్తున్నారు.

AP: వచ్చే నెలలోనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మామూలుగా ఏటా మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి ఓ నెల ముందుగానే ఈ తంతు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో బడ్జెట్ సమర్పించి ఏప్రిల్ నుంచే ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఆర్థికశాఖ చర్చలు జరపనుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘పంజా’ చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోకపోయినా విష్ణు వర్ధన్ డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. పవన్‌ను స్టైలిష్‌గా చూపించారని అభిమానులు ఖుషీ అయ్యారు. తాజాగా పవన్ తనయుడు అకీరా నందన్‌తో పంజా సీక్వెల్ తీస్తారా? లేదా వేరే మూవీ తీస్తారా అన్న మీడియా ప్రశ్నకు విష్ణు బదులిచ్చారు. దేనికైనా టైమ్ రావాలని, అవకాశం వస్తే తప్పక మూవీ చేస్తానని ‘ప్రేమిస్తావా’ ఈవెంట్‌లో చెప్పారు.

15 నెలల తర్వాత 3 లక్షల మందికిపైగా పాలస్తీనియన్లు గాజాకు చేరుకున్నారు. ధ్వంసమైన శిథిలాల్లోనే తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పాటు చేసుకున్నారు. రాళ్లు రప్పల మధ్య మళ్లీ మొదటి నుంచి బతికేందుకు వారు సిద్ధమయ్యారు. గాజాకు వంట గ్యాస్ డెలివరీ కూడా అందుబాటులోకి వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వైట్‌హౌస్‌కు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఆహ్వానం పంపారు.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంపై ఆర్జీవీకి ఈ నోటీసులు పంపారు. కాగా గతంలోనూ ఆర్జీవీకి పోలీసులు సమన్లు అందించారు. కానీ విచారణకు హాజరు కాలేనంటూ తన న్యాయవాదులతో సమాచారం పంపారు.

AP: ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం అదే గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. పింఛన్లు, ఇంటి స్థలాలు, సొంతిళ్ల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 14 పరుగులకే వెనుదిరిగి నిరాశ పరిచారు. గత పది టీ20ల్లో 172 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యారు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. తన స్థాయికి తగ్గ ఆట ఆడటం లేదు. ఇలానే ఆడితే రోహిత్ శర్మలానే సూర్య కూడా రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తాయని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని సీఎం రేవంత్ నియమించారు. వారం రోజుల్లో సమగ్ర విధివిధానాలతో నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. తక్కువ ధరకే ఇసుక దక్కేలా అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

1920: రచయిత, దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు జననం
1936: సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం
1936: సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు జననం
1962: ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జననం
1977: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ బస్టర్ నుపెన్ మరణం
2003: నటి పండరీబాయి మరణం
2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రామేశ్వర్ ఠాకూర్ నియామకం

TG: ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలను ఏపీ తీసుకెళ్లే ఆలోచన చంద్రబాబుకు లేదని చెప్పారు. ‘చంద్రబాబు హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఏపీకి గ్లోబల్ క్యాపబులిటీ ఉంది. ఆ రాష్ట్రానికి తీర ప్రాంతం, సహజ వనరులు అపారంగా ఉన్నాయి. ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.