India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంపీ కంగనా రనౌత్‌పై <<13394142>>చేయి<<>> చేసుకున్న CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ‘నేను హింసకు మద్దతు ఇవ్వను. కానీ ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నా. కుల్వీందర్‌పై CISF చర్యలు తీసుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. జై హింద్. జై జవాన్. జై కిసాన్’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. కాగా ఆమెపై FIR నమోదైన విషయం తెలిసిందే.
రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. నేడు రాత్రి లేదా రేపు పార్టీ పెద్దలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ మార్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై వారితో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. సీఎంతో పాటు దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ జీతం ఎంతన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. నియోజకవర్గ అలవెన్స్‌లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే జీతంగా అందుకుంటారు. ఇక దేశంలోనే తెలంగాణ ఎమ్మెల్యేలు అత్యధిక (రూ.4 లక్షలు)జీతం అందుకుంటున్నారు.
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ తన లోగోలను మార్చేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో రెండు రకాల బ్రాండ్ లోగోల ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసింది. ఒకటి ఓల్డ్-స్కూల్ డిజైన్ కాగా మరొకటి స్టైలిష్ వెర్షన్‌లో ఉండనుంది. వీటిల్లో ఓల్డ్-స్కూల్ లోగోను బైక్ ట్యాంక్‌పై, స్టైలిష్ లోగోను ఇతర భాగాలపై చూడొచ్చని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.90 కోట్లకుపైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టై అయిన రెండు మ్యాచ్‌లలో ఓడిన తొలి జట్టుగా నిలిచింది. 2007లో భారత్ చేతిలో ‘బౌల్ ఔట్’లో పాక్ ఓడిపోగా, నిన్న పసికూన అమెరికా కూడా ఆ జట్టుపై సూపర్ ఓవర్‌లో సంచలన <<13394149>>విజయం<<>> సాధించింది. 2012లో కివీస్‌పై శ్రీలంక, విండీస్‌పై న్యూజిలాండ్, ఈ ఏడాది ఒమన్‌పై నమీబియా సూపర్ ఓవర్‌లో గెలిచాయి.
AP: టీడీపీ గూండాలు మాజీ మంత్రి కొడాలి నాని ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారని వైసీపీ చేసిన ట్వీట్‌కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘వైసీపీది ఫేక్ న్యూస్. రోడ్డు మీద కార్లో వెళ్తూ.. టీడీపీ మహిళలపై గుట్కా ఊసి కారు దిగి పారిపోయిన గుట్కా నానిపై కోడి గుడ్లు వేసి తమ భావ ప్రకటనా స్వేచ్ఛ తెలియజేశారు’ అంటూ టీడీపీ పోస్ట్ పెట్టింది.
దక్షిణాఫ్రికాలో నిర్వహించే SA20 లీగ్ మూడో సీజన్ తేదీలు వెల్లడయ్యాయి. 2025 జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్‌గా నిలిచింది. SRH ఓనర్ కావ్య మారన్ ఈ జట్టుకు కూడా యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించినందుకు బాలయ్యను డైరెక్టర్లు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ కలిసి అభినందించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే గోపీచంద్ డైరెక్షన్‌లో వీరసింహారెడ్డి, అనిల్ దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రాల్లో ఆయన నటించారు.
TG: ఎన్నికల కోడ్ వల్ల కాళేశ్వరంపై ఇన్నాళ్లూ సమీక్షలు చేయలేదని, ఇకపై మరమ్మతులు వేగవంతం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన సుందిళ్ల బ్యారేజీ వద్ద పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన రూ.94వేల కోట్ల అప్పునకు వడ్డీ కడుతున్నాం. BRS హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పగుళ్లతో ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.