News January 28, 2025

భారత్‌కు షాక్.. ఇంగ్లండ్ విజయం

image

భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేసింది. హార్దిక్(40) కాసేపు ప్రయత్నించినా మరోవైపు నుంచి సహకారం కరువైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3, ఆర్చర్, కార్స్ తలో 2, రషీద్, వుడ్ చెరో వికెట్ తీశారు. 5 టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.

Similar News

News February 15, 2025

సోమనాథ్ క్షేత్రం ప్రత్యేకతలు మీకు తెలుసా… !

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో గుజరాత్‌లో ఉండే సోమనాథ్ క్షేత్రం మెుదటిది. చంద్రునికి శాపవిముక్తి కలిగించిన ప్రదేశం కాబట్టి దీనికి సోమనాథ క్షేత్రంగా పేరొచ్చిందని ప్రతీతి. చంద్రుడు ఈక్షేత్రాన్ని బంగారంతో నిర్మించగా, రావణాసురుడు వెండితో, శ్రీ కృష్ణుడు చందనపు చెక్కలతో నిర్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. గజనీ మహమ్మద్ సహా అనేక మంది దాడి చేసి సంపద దోచుకెళ్లగా 1951లో పునర్నిర్మించి ప్రారంభించారు.

News February 15, 2025

‘విశ్వంభర’లో మెగా హీరో?

image

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ మూవీలో మెగా హీరో సాయి దుర్గతేజ్ అతిథి పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ షూట్‌లో ఆయన పాల్గొన్నారని తెలిపాయి. మరోవైపు చిరు ఇంట్రో సాంగ్ షూట్ జరుగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. దీంతో ఆయన సాంగ్‌లో కనిపిస్తారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు చిరంజీవి సినిమాలోని సాంగ్స్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.

News February 15, 2025

ఎంతో చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె సహకరించట్లేదు: సీఎం

image

AP: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు.

error: Content is protected !!