News June 7, 2024

సరైన సమయంలో సరైన నాయకత్వం దొరికింది: CBN

image

భారత దేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం అందివచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ దూరదృష్టి కలిగిన నాయకుడని, భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన నేతృత్వంలో దేశం 2047 నాటికి నంబర్ వన్‌గా నిలుస్తుందని అన్నారు.

News June 7, 2024

REVIEW: శర్వానంద్ ‘మనమే’

image

చనిపోయిన స్నేహితుడి కొడుకు భవిష్యత్తు కోసం హీరో తీసుకునే బాధ్యతే ‘మనమే’. ఎప్పటిలాగే శర్వానంద్ తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించారు. పిల్లాడితో హీరోహీరోయిన్‌ ఎమోషనల్ సీన్లు కనెక్ట్ అవుతాయి. కృతిశెట్టి తన పాత్రకు న్యాయం చేయగా, మాస్టర్ విక్రమాదిత్య ఆకట్టుకున్నాడు. రొటీన్ స్టోరీ, కొన్ని బోరింగ్ సీన్లు మైనస్. మ్యూజిక్, డైలాగ్స్ ఆశించినంతగా లేవు.
రేటింగ్-2.5/5

News June 7, 2024

AP CSగా నీరభ్ కుమార్ బాధ్యతలు

image

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. TTD, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సీఎస్ కుర్చీలో ఆశీనులయ్యారు. స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News June 7, 2024

ఎన్డీఏ స్టీరింగ్ చంద్రబాబు చేతుల్లో: కాంగ్రెస్

image

బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ పోస్టులతో విరుచుకుపడుతోంది. ‘ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో మోదీ పాత్ర నామమాత్రమే. స్టీరింగ్ చంద్రబాబు, నితీశ్ చేతుల్లోనే’ అని అర్థం వచ్చేలా తాజాగా ఓ సెటైరికల్ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆటోను చంద్రబాబు డ్రైవింగ్ చేస్తున్నట్లు ఉండగా వెనకాల మోదీ దిగాలుగా ఉన్నారు. దీనికి ‘400 పార్ రవాణా సేవలు’ అని క్యాప్షన్ ఇచ్చింది.

News June 7, 2024

వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

image

AP బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి HYD నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జగన్ హయాంలో YCPకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని ఆరోపణలున్నాయి. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి.

News June 7, 2024

ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి

image

TG: వరి ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరి ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పన తమ లక్ష్యమని, అందుకోసం కలిసిగట్టుగా కృషి చేస్తున్నామని చెప్పారు.

News June 7, 2024

సాయంత్రం భారీ వర్షం.. జాగ్రత్తలు పాటించండి: GHMC

image

హైదరాబాద్‌లో ఇవాళ సా.5గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని GHMC డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు. నగర వాసులు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది. ఆఫీస్‌లు, ఇతర పనులపై బయటికి వెళ్లినవారు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. శిథిల భవనాలు, చెట్ల కింద ఉండొద్దని, అత్యవసర సమయాల్లో సహాయం కోసం 90001 13667 నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొంది.

News June 7, 2024

జగన్ కీలక ఆదేశాలు

image

AP: ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ శ్రేణులపై కూటమి నేతలు <<13390762>>దాడులు <<>>చేస్తున్నట్లు YCP ఆరోపిస్తోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని జగన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు ఉండనున్నారు.

News June 7, 2024

MLC ఓట్ల కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

image

TG: నల్గొండ-వరంగల్-ఖమ్మం MLC ఉపఎన్నికల కౌంటింగ్‌లో 33 మంది అభ్యర్థులను ఇప్పటివరకు ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,210, BRS అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,514 ఓట్లు వచ్చాయి. గెలుపు కోసం 1,55,095 ఓట్లు అవసరం కాగా.. మల్లన్నకు 31,885, రాకేశ్‌కు 50,581 ఓట్లు కావాలి.

News June 7, 2024

DEECET నోటిఫికేషన్ విడుదల

image

TG: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల కోర్సు(2024-26)లో చేరేందుకు ప్రవేశ పరీక్ష DEECET-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఈనెల 30 వరకు <>deecet.cdse<<>> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్ జులై 10న జరగనుంది.