News January 29, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 29, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.25 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 29, 2025

నేడు జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం

image

ఇస్రో తన 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం చేపట్టనుంది. దీని ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. 2,250 KGల బరువున్న ఈ శాటిలైట్‌ను 36,000 KM దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ దేశ నావిగేషన్ సిస్టం కోసం పనిచేయనుంది. సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక అనువర్తనాలు, భౌగోళిక నావిగేషన్‌ను మెరుగుపరచనుంది.

News January 29, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 29, 2025

శుభ ముహూర్తం (29-01-2025)

image

✒ తిథి: అమవాస్య సా.6.51 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాషాడ ఉ.9.06 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30-9.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 వరకు
✒ వర్జ్యం: మ.1.07-2.41 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.33-12.07 వరకు

News January 29, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* HYDకు పెట్టుబడులు రాకుండా కొందరి కుట్ర: సీఎం రేవంత్
* హైదరాబాద్‌లో మరో రెండు ఐటీ పార్కులు: శ్రీధర్ బాబు
* ఆరోగ్య శ్రీ అంటే వైఎస్సార్.. రైతు బంధు అంటే కేసీఆర్: కేటీఆర్
* జూన్‌లోగా నామినేటెడ్ పదవుల భర్తీ: సీఎం CBN
* CBN గారూ.. బీజేపీకి మీ మద్దతు ఉపసంహరించుకోండి: షర్మిల
* మూడో టీ20లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
* అండర్-19 ఉమెన్స్ WCలో తెలుగమ్మాయి త్రిష సెంచరీ

News January 29, 2025

వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్

image

ఇంగ్లండ్‌పై 5 వికెట్లతో విరుచుకుపడిన వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించారు. T20ల్లో 2 సార్లు 5 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచారు. కుల్దీప్ యాదవ్‌ 40, భువనేశ్వర్ కుమార్‌ 87 మ్యాచుల్లో ఈ రికార్డ్ అందుకోగా, వరుణ్ కేవలం 16 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించారు. అలాగే గత 10 T20ల్లో చక్రవర్తి 27 వికెట్లు తీశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది.

News January 29, 2025

కేజ్రీవాల్‌కు ఈసీ లేఖ

image

యమునా నదిలోకి హరియాణా కావాలనే విషపూరిత వ్యర్థాలను వదులుతోందని AAP కన్వీనర్ కేజ్రీవాల్ చేసిన కామెంట్లపై EC స్పందించింది. ఈ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని, రేపు రాత్రి 8 గంటల్లోపు వివరణ ఇవ్వాలని లేఖ రాసింది. HR నుంచి ఢిల్లీకి వస్తున్న యమునాలో అమ్మోనియం స్థాయులు 6 రెట్లు అధికంగా ఉన్నాయని, దీంతో హస్తిన వాసులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. అటు FEB 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి.

News January 29, 2025

55% మంది ట్రక్కు డ్రైవర్లకు దృష్టి సమస్యలు!

image

దేశంలో 55% ట్రక్ డ్రైవర్లు దృష్టి సమస్యలతో బాధపడుతున్నట్టు IIT ఢిల్లీ-ఫోర్సైట్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. వీరిలో 53% మందికి దూర దృష్టి, 47% మందికి దగ్గరి దృష్టి సమస్యలు ఉన్నట్లు వెల్ల‌డైంది. 44.3% డ్రైవర్లు BMI, 57.4% మంది BP సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితులు రహదారి భద్రతను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వారి ఆరోగ్య సంరక్షణ అవసరాన్ని నొక్కిచెప్పినట్టైంది.

News January 28, 2025

భారత్‌కు షాక్.. ఇంగ్లండ్ విజయం

image

భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేసింది. హార్దిక్(40) కాసేపు ప్రయత్నించినా మరోవైపు నుంచి సహకారం కరువైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3, ఆర్చర్, కార్స్ తలో 2, రషీద్, వుడ్ చెరో వికెట్ తీశారు. 5 టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.

News January 28, 2025

UKలోని 200 సంస్థల్లో 4 డేస్ వీక్‌ అమలు

image

UKలో 5K+ ఉద్యోగులున్న‌ 200 కంపెనీలు 4 డేస్ వీక్‌ అమ‌లుకు అంగీకరించాయి. వందేళ్ల క్రితం ప్రారంభ‌మైన‌ 9-5, ఐదు రోజుల పని వారం ఇప్పటి కాలానికి అనుగుణంగా లేదని నిపుణులు భావిస్తున్నారు. వారానికి 4 రోజుల పని ఉద్యోగులకు 50% ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుందని, ఇది వారి జీవితాలను సంతోషంగా, సంతృప్తిగా గడపడానికి అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మరోవైపు భారత్‌లో 70, 90 గంటల పనివేళలపై చర్చ నడుస్తుండడం తెలిసిందే.