News January 28, 2025

స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు సీఎం రివ్యూ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. రేపు ఎన్నికల నిర్వహణపై ఆయన మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో రేపు జరిగే మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News January 28, 2025

తెలుగమ్మాయి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

image

మచిలీప‌ట్నానికి చెందిన సింగ‌వ‌ర‌పు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించింది. 2014లో ఎస్తేర్‌ను చంద్ర‌భాను ముంబైలో హత్యాచారం చేసిన‌ట్టు నిర్ధారించిన ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో హైకోర్టు కూడా స‌మ‌ర్థించింది. నిందితుడు దీన్ని సుప్రీంకోర్టులో స‌వాల్ చేయగా చంద్ర‌భాను హ‌త్య‌చేసిన‌ట్టు ప్రాసిక్యూష‌న్ నిరూపించలేక‌పోయిందంటూ అతడిని నిర్దోషిగా తేల్చింది.

News January 28, 2025

HYD నుంచి కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

News January 28, 2025

రేవంత్ మానసిక వైద్యుడిని సంప్రదించాలి: హరీశ్ రావు

image

TG: ఎప్పుడో ముగిసిన దావోస్ పర్యటనపై ఇప్పుడెందుకు దావత్ అంటూ సీఎం రేవంత్ ప్రెస్ మీట్‌పై హరీశ్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో ఎదురుచూస్తూ కొండంత ఆందోళన చేస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటావా? అని సీఎంను నిలదీశారు. రైతుల అప్పులు ముఖ్యమా? దావోస్ డప్పులు ముఖ్యమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ కళ్లు తెరవాలని, మంచి మానసిక వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

News January 28, 2025

1M1B ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు: CM

image

AP: కుప్పంలో UNకు చెందిన ‘1M1B’ సంస్థ గ్రీన్ స్కిల్స్ అకాడమీ సెంటర్ ప్రారంభించినట్లు CM చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తుకు అవసరమైన టెక్నాలజీతో వర్క్‌ఫోర్స్‌ను ఇది అందిస్తుందని చెప్పారు. కొన్నేళ్లలో 1M1B(1మిలియన్ 1 బిలియన్) ద్వారా 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని వెల్లడించారు. దీని ద్వారా 30వేల మందికి వర్క్‌ప్లేస్ అనుభవం, ఇంటర్న్‌షిప్ అందుతుందని అంచనా వేశారు.

News January 28, 2025

సంజూ మరో ‘సారీ’

image

భారత ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సిరీస్‌లో మరో సారి విఫలమయ్యారు. మూడు మ్యాచుల్లో ఆయన ఆర్చర్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం గమనార్హం. తొలి మ్యాచులో 26 పరుగులు చేయగా తర్వాతి రెండు మ్యాచుల్లో 8 పరుగులే నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం అవకాశాలు రావట్లేదని బాధపడితే ఇప్పుడు ఛాన్స్ వచ్చినా వినియోగించుకోవట్లేదని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News January 28, 2025

SHOCK: 4 వికెట్లు కోల్పోయిన భారత్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత జట్టుకు షాక్ తగిలింది. 68 పరుగులకే ఓపెనర్లు అభిషేక్(24), శాంసన్‌(3) సహా సూర్య కుమార్ యాదవ్(14), తిలక్ వర్మ వికెట్లను కోల్పోయింది. రెండో టీ20 మ్యాచ్ విన్నర్ తిలక్ 18 పరుగులే చేసి రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు.

News January 28, 2025

హైదరాబాద్‌లో మరో రెండు ఐటీ పార్కులు: శ్రీధర్ బాబు

image

TG: హైదరాబాద్‌కు మరో రెండు ఐటీ పార్కులు రానున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న IT హబ్‌గా HYDను మరింత తీర్చిదిద్దేలా హైటెక్ సిటీలా మరో రెండు కొత్త ఐటీ పార్కులను డెవలప్ చేస్తామన్నారు. సరైన లోకేషన్ల కోసం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, అపరిమిత అవకాశాలతో ఈ ఐటీ పార్కులు హైదరాబాద్‌కు మైలురాయిగా నిలుస్తాయన్నారు.

News January 28, 2025

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో T20లో ఇంగ్లండ్ టీమ్‌ఇండియా ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ENG 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ డకెట్(51) అర్ధసెంచరీ చేశారు. ఒకానొక దశలో ఇంగ్లండ్‌ 140 పరుగులే అందుకోవడం కష్టమనుకున్న సమయంలో లివింగ్ స్టోన్ (43) బిష్ణోయ్ ఓవర్లో మూడు సిక్సులు కొట్టి 19రన్స్ రాబట్టారు. వరుణ్ 5, హార్దిక్ 2, బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

News January 28, 2025

కుంభమేళాలో ప్రకాశ్ రాజ్.. నిజమిదే

image

తాను కుంభమేళాకు వెళ్లానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ కావడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తప్పుడు ప్రచారం చేసి పవిత్ర పూజలను కలుషితం చేయడమే పిరికి వాళ్ల పని అని దుయ్యబట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మిగతాది కోర్టులో చూసుకుందామని రాసుకొచ్చారు.